Hari Hara Veera Mallu: మెగా సెంటిమెంట్ ఫాలో అవుతున్న నిర్మాతలు.. కలిసొచ్చేనా?

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలకు కమిటీ అయ్యారు. ఈ క్రమంలోనే వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈయన తదుపరి వరుస సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభించినప్పటికీ పెద్ద ఎత్తున బ్రేక్ ఇచ్చారు.

ఇలా పలుమార్లు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడటంతో ఇటు నిర్మాతలు అభిమానులు సైతం ఎంతో అసహనం వ్యక్తం చేశారు. ఇకపోతే ఈ సినిమాని ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని ప్రకటించడంతో అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు అయితే ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతున్నడంతో అభిమానులు ఈ సినిమాపై పూర్తిగా ఆశలు వదిలేశారు.

ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా విడుదల కాబోతుందని ప్రకటించినప్పటికీ అది కూడా నెరవేరదని తెలిసిపోయింది. ఇక ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ అభిమానులలో కాస్త గందరగోల పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో మరోసారి అందరిలోనూ సినిమాపై ఆశలు కలిగాయి.

ఈ సినిమా వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుని వచ్చే ఏడాది మార్చి 30 వ తేదీ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విధంగా మార్చి 30వ తేదీ విడుదల చేయబోతున్నారని తెలియడంతో పవన్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరోవైపు ఈసారైనా ఈ సినిమా పక్కాగా విడుదలవుతుందా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మార్చి 30 మెగా సెంటిమెంట్ కావడంతో ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని భావిస్తున్నారు. మార్చి 30వ తేదీ రామ్ చరణ్ నటించినరంగస్థలం సినిమా విడుదలయి మంచి హిట్ అయింది తద్వారా ఈ సినిమా కూడా హిట్ అవుతుందని పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -