Mahesh-Sitara: టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సితార.. మహేష్ ప్లాన్ మామూలుగా లేదు?

Mahesh-Sitara: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట సినిమాతో ఎంతో మంచి హిట్ అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీ అయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా మొదలైంది.

ఇప్పటికే ఒక షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ప్రారంభించే ముందు మహేష్ బాబు తల్లి మరణించడంతో ఈ సినిమా షూటింగుకు కాస్త బ్రేక్ పడింది. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ బాబు కుమార్తె సితార ఎంత యాక్టివ్ గా ఉంటారో మనకు తెలిసిందే.

ఇప్పటికే సితార మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో పెన్ని ప్రమోషన్ సాంగ్ లో పాల్గొన్నారు.అయితే ఈసారి మహేష్ బాబు సితార విషయంలో సూపర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది ఏకంగా ఈమెను టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే సితార ఎంట్రీ మహేష్ బాబు సినిమాతోనే ఉండేలా ఈయన ప్లాన్ చేశారట.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలో ఒక పాటలో కీలకపాత్ర ఉండబోతుందని ఆ పాత్రలో సితార నటించేలా మహేష్ బాబు ప్లాన్ చేశారని సమాచారం.అదేవిధంగా ఈ సినిమాలో మహేష్ బాబు సితార మధ్య కొన్ని ఫన్నీ సన్నివేశాలు కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది.మరి సితార గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇదే కనుక నిజమైతే మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -