Prabhas: పాన్ ఇండియా హీరో ప్రభాస్ కి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు?

Prabhas: మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు ఇప్పటికే ఎన్నో బాధలతో సతమతమవుతున్న ప్రభాస్ కి వరుసగా దెబ్బ పై దెబ్బ పడుతున్నాయి. బాహుబలి తర్వాత ఊహించని స్థాయిలో హిట్టు పడక సతమతమవుతున్న ప్రభాస్ కి తన పెదనాన్న మరణం మరింత కృంగదీసింది. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడుతున్న ప్రభాస్ కు ఆది పురుష్ ద్వారా మరికొంత తలనొప్పి వచ్చి చేరి పడింది.

ఆది పురుష్ సినిమా నుంచి టీజర్ విడుదల చేయడంతో ఈ టీజర్ ఎన్నో విమర్శలకు కారణమైంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఈ సినిమాని బ్యాన్ చేయాలంటూ కొందరు ట్రోలింగ్ చేయగా మరొకవైపు రాజకీయ నాయకులు కూడా ఈ టీజర్ పై స్పందిస్తూ రామాయణంను అవమాన పరుస్తున్నారంటూ పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇకపోతే ఈ సినిమా టీజర్ ఎన్నో వివాదాలు చుట్టుముట్టుకొని తలనొప్పిగా మారింది.

ఇదిలా ఉండగా తాజాగా ఈ టీజర్ మరొక వివాదంలో చిక్కుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా చిత్ర బృందానికి అలాగే ప్రభాస్ కి ఢిల్లీ హైకోర్టు నోటీసులను జారీ చేసింది. ఈ సినిమా టీజర్ విషయంపై ఓవర్గం దేవుళ్లను ఎంతో అవమానకరంగా చూపించారని న్యాయవాది రాజ్ గౌరవ్ పిటిషన్ వేయడంతో హైకోర్టు ఈ చిత్ర బృందానికి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఎంతో శాంతివంతుడైన రాముడిని ఈ సినిమాలో క్రూరమైన ప్రతీకార రూపంగా చూపించారని ఈయన పిటిషన్ లో పేర్కొన్నారు.

రాముడి పాత్రతో పాటు రావణుడి పాత్ర కూడా చాలా భయంకరంగా ఉందని, ఆరోపించిన రాజ్ గౌరవ్ ఈ సినిమా విడుదలపై స్టే ఇవ్వాలంటు కోర్టును ఆశ్రయించారు. ఇక ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు చిత్ర బృందానికి అలాగే ప్రభాస్ కి నోటీసులను జారీ చేస్తుంది.అయితే ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదని తెలుస్తోంది. అయితే ఈ టీజర్ విషయంలో దర్శకుడు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఇందులో ఎలాంటి మార్పులు చేస్తారు అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -