Boora Narasaiah: మునుగోడు టీడీపీ అభ్యర్ధిగా మాజీ ఎంపీ? పోటీకి టీఆర్ఎస్ సీనియర్ నేత రెడీ?

Boora Narasaiah: ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీలన్ని మునుగోడు ఉపఎన్నికలో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మునుగోడుపై తమ పార్టీ జెండా ఎగురవేసేందుకు కసరత్తులు చేస్తన్నాయి. జోరుగా ప్రచారం నిర్వహిస్తూ మునుగోడు రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. ప్రలోభాల పర్వానికి తెరలేపిన పార్టీలు.. ఓటర్లను ఆకట్టుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. భారీగా నగదు అందజేస్తున్నాయి. ఓటుకు రూ.10 వేల పైనే ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలన్ని పోటీ పడి ఇస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

అయితే మునుగోడులో ప్రధాన పార్టీల మధ్యే పోటీ నడుస్తోండగా.. మిగతా పార్టీలు కూడా బరిలోకి దిగుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ కూడా మునుగోడు ఉపఎన్నికలో పోటీలోకి దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లోని తన నివాసంలో తెలంగాణ ముఖ్యనేతలతో పాటు మునుగోడు టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. మునుగోడులో పోటీపై చర్చించారు. మునుగోడులో పోటీకి తాము సిద్దంగా ఉన్నామని మునుగోడు నేతలు చంద్రబాబుకు వివరించారు. అలాగే రాష్ట్రంలో టీడీపీ బలోపేతంపై చంద్రబాబు నేతలతో చర్చించారు తెలగాణలో టీడీపీకి క్యాడర్ ఇంకా ఉందని, ప్రజా సమస్యలపై పోరాడాలని బాబు సూచించారు. ఇక నుంచి తరచూగా ఎన్టీఆర్ భవన్ కు వస్తానని, తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి పెడతానన్నారు.

మునుగోడులో అన్ని పార్టీలు రెడ్డి నేతలకే టికెట్ ఇచ్చాయని, టీడీపీ నుంచి బీసీ నేతలకు టికెట్ ఇవ్వాలని బాబును నేతలను కోరారు. దీంతో మునుగోడులో పోటీపై ఈ నెల 13న నిర్ణయం తీసుుంటానంటూ నేతలకు చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. బీసీలు ఎప్పటినుంచే టీడీపీకి వెన్నెముకగా ఉన్నారని, ఒకవేళ పోటీ చేయాలని నిర్ణయించే బీసీ నేతకే టికెట్ ఇస్తామంటూ ప్రకటించారు. ఈ క్రమంలో మునుగోడు టీడీపీ అభ్యర్థిపై ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పేరు తెరపైకి వచ్చింది. ఆయన బీసీ సామాజికవర్గానకి చెందిన నేత కావడం విశేషం.

అంతేకాకుండా టీఆర్ఎస్ నుంచి ఎంపీగా 2014 ఎన్నికల్లో గెలిచారు. ప్రస్తుతం టీఆర్ఎస్ లో నేతగా కొనసాగుతున్నారు. మునుగోడు ఉపఎన్నిక టికెట్ కోసం ఆయన కూడా ప్రయత్నాలు చేశారు. కానీ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే సీఎం కేసీఆర్ టికెట్ ఇవ్వడంతో బూర నర్సయ్య గౌడ్ మునుగోడు టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న బూర నర్సయ్య గౌడ్ తో టీడీపీ సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ నుంచి టికెట్ ఇస్తామని, పోటీలోకి దిగాలని సూచించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబుతో బూర నర్సయ్య గౌడ్ తో సాన్నిహిత్యం ఉంది. దీంతో మునుగోడు టీడీపీ అభ్యర్ధిగా ఆయన పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. మునుగోడులో టీడీపీకి క్యాడర్ బాగానే ఉంది. దీంతో బూర నర్సయ్య గౌడ బరిలోరకి దిగితే ప్రధాన పార్టీలకు చెక్ పెట్టవచ్చనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారట. ఈ నెల 13న దీనిపై టీడీపీ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -