Salaar: ఆకట్టుకున్న పృధ్విరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్.. వైరల్ అవుతున్న ఫోటో?

Salaar: కేజిఎఫ్ సినిమా ద్వారా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కే జి ఎఫ్ చాప్టర్ 1 చాప్టర్ 2 అంటూ రెండు భాగాలుగా రూపొందిన సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా అందాల నటి శృతిహాసన్ నటిస్తోంది.

ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ప్రశాంత్ నీల్ ఈ సినిమా నుండి ఒక క్రేజీ సీక్రెట్ బయటపెట్టి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. సలార్ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా… జగపతిబాబు , పృధ్విరాజన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.

ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్ గా `వర్ధరాజా మన్నార్‌` పాత్రలో పృథ్వీరాజ్ నటిస్తున్నాడు.తాజాగా పృధ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో పృథ్వీరాజ్ ఆయన ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది యూనిట్‌. ప్రశాంత్ నీల్ ట్విట్టర్ ద్వారా పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ ఫోటోని షేర్ చేశాడు. ఈ ఫోటోలో పృథ్వీరాజ్ చాలా భయంకరంగా ఉంది.

పృథ్వీరాజ్‌ ముక్కుకి పుడక, మెడలో వెండి కడీలు ముఖంపై గాట్లు, కళ్లల్లో కోపం,నుదుటిపై పొడువైన బొట్టు, చెవికి రింగులతో , శరీరమంతా నల్లటి మరకలతో అత్యంత భయంకరంగా కనిపిస్తున్నారు. ఈ ఫోటో చూసిన నెటిజన్స్ ప్రభాస్ కి సరైన విలన్ దొరికాడంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఇక ఈ ఫోటో చూసిన పృథ్వీరాజ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -