Sapthami Gowda: దేనికైనా రెడీ అంటోన్న ‘కాంతార’ బ్యూటీ.. హద్దులు పెట్టుకోనంటూ?

Sapthami Gowda: ఇటీవల విడుదలైన కాంతార సినిమా అత్యంత భారీ వసూళ్లు రాబట్టింది. భారీ కలెక్షన్లు సాధించిన కన్నడ సినిమాల్లో కాంతార మూడో స్థానాన్ని దక్కించుకుంది. సినిమా విడుదలై మూడు వారాలు గడుస్తున్న నేపథ్యంలో రూ.103 కోట్లు వసూళ్లతో దూసుకెళ్తోంది. కన్నడ సినిమాలు కేజీఎఫ్-2, కేజీఎఫ్ సినిమాల తర్వాత ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టిన సినిమా కాంతార మాత్రమే. కేవలం కన్నడ వెర్షన్‌లోనే వంద కోట్లు వసూలు చేసింది. తెలుగులోనూ పాజిటివ్ టాక్ అందుకుంది. అలాగే హిందీ వెర్షన్‌లోనూ భారీ వసూళ్లు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘కాంతార’ హాట్ టాపిక్‌గా నిలిచింది. ఈ సినిమాలో దర్శకుడిగా, హీరోగా రిషబ్ శెట్టి కీలక పాత్ర పోషించాడు. ఒక్క సినిమాతోనే హీరోయిన్ సప్తమి గౌడకు పాన్ ఇండియా స్థాయి గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తాజాగా హీరోయిన్ సప్తమి గౌడ సినిమా సక్సెస్‌పై మాట్లాడారు. ఈ సందర్భంగా కన్నడ బ్యూటీ సప్తమి గౌడ మాట్లాడుతూ.. ‘పాన్ ఇండియా సినిమాలు, ఓటీటీ ప్లాట్‌ఫాంల వల్ల చిత్ర పరిశ్రమలో భాషా సరిహద్దులు తొలగిపోయాయి. దేశవ్యాప్తంగా ‘కాంతార’ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. కన్నడ, తమిళం, తెలుగులోనూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.’ అని పేర్కొన్నారు.

‘ఈ సినిమా ప్రాజెక్ట్ కోసం మొదట నన్ను సంప్రదించినప్పుడు సినిమా స్టోరీ, పాత్రకు సంబంధించిన విషయాల గురించి నాకేం తెలియదు. నాపై ఉన్న నమ్మకంతో దర్శకుడు రిషబ్ నన్ను ఎంపిక చేయడం సంతోషకరమైన విషయం. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. కేవలం కన్నడ సినిమాలకే పరిమితం కాకుండా ఇతర భాషల్లో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను. ఆ విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోను.’ అని హీరోయిన్ సప్తమి గౌడ అన్నారు. అయితే కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కాంతార సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -