Anchor Anasuya Sister: అక్క స్థానాన్ని భర్తీ చేయనున్న అనసూయ చెల్లి వైష్ణవి?

Anchor Anasuya Sister: తెలుగు బుల్లితెరపై గ్లామరస్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో అనసూయ ఒకరు. అనసూయ యాంకర్ గా రానంతవరకు యాంకర్ అంటే ఎంతో పద్ధతిగా ఉండాలనే భావన అందరిలో ఉండేది. అనసూయ ఎప్పుడైతే యాంకర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారో ఆ క్షణం నుంచి తన గ్లామర్ తో అందరిని ఎంతగానో ఆకట్టుకున్నారు.పొట్టి పొట్టి దుస్తులతో అద్భుతమైన మాట తీరుతో ఆటపాటలతో ఎంతోమందిని ఆకట్టుకున్నారు.

ఈ విధంగా యాంకర్ గా తనకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈ యాంకరమ్మ బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పారు. ఒకవైపు సినిమాలు మరోవైపు టీవీ షోస్ చేస్తూ బిజీగా ఉన్న నేపథ్యంలో టీవీ షోలకు గుడ్ బై చెప్పారు.

ఇక అనసూయ బుల్లితెర కార్యక్రమాల నుంచి దూరం కావడంతో ఈమె లేని లోటు స్పష్టంగా కనబడుతోంది. అనసూయ వెళ్ళిపోవడంతో జబర్దస్త్ కార్యక్రమానికి కూడా రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా అనసూయ జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనప్పటికీ ఈమె లేని వెలితిని తన చెల్లెలు తీర్చనున్నట్టు తెలుస్తోంది.అచ్చం అనసూయ పోలికలతోనే ఉన్నటువంటి తన సోదరి వైష్ణవి యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అనసూయకు ఇద్దరు చెల్లెల్లు ఉన్నారనే విషయం మనకు తెలిసిందే. వీరిలో వైష్ణవి అనే చెల్లెలిని అనసూయ ఇండస్ట్రీకి యాంకర్ గా పరిచయం చేయబోతున్నారట. ఈ క్రమంలోనే త్వరలోనే వైష్ణవి బుల్లితెరపై యాంకర్ గా ప్రేక్షకులను సందడి చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయని త్వరలోనే ఈమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంతోమంది యాంకర్స్ ఇండస్ట్రీలో పోటీ పడుతుండగా ఇప్పుడున్న వారికి వైష్ణవి గట్టి పోటీ ఇవ్వడం కోసం రంగంలోకి దిగబోతున్నారని సమాచారం. అయితే జీ తెలుగులో కొత్తగా ప్రారంభం కాబోయే షోలోఈమె యాంకర్ గా వ్యవహరించబోతున్నట్లు సమాచారం త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -