Anasuya: 35 ఏళ్ళు వచ్చాక నీకిప్పుడు అవసరమా ఆంటీ.. అనసూయ వీడియోపై సెటైర్లు మామూలుగా లేవుగా!

Anasuya: తెలుగు ప్రేక్షకులకు ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనసూయ ప్రస్తుతం చేతినిండా అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు యాంకర్ గా తన సత్తాను చాటుతూ బుల్లితెర ప్రేక్షకులను అలరించిన అనసూయ ప్రస్తుతం నటిగా వరుసగా అవకాశాలను అందుకుంటూ వెండితెర ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. అయితే అనసూయ నటిస్తున్న సినిమాలు అన్నీ కూడా మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంటుండడంతో ఆమెకు వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి.

ప్రస్తుతం అనసూయ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తరచూ సోషల్ మీడియాలో ట్రోల్స్ ని కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో అనసూయ ఎటువంటి పోస్ట్ చేసినా కూడా కొంతమంది కావాలనే ట్రోల్స్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అనసూయ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. తనపై ట్రూల్స్ నెగిటివ్ కామెంట్స్ చేసేవారికి తనదైన శైలిలో సమాధానం చెబుతూనే ఉంది.. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో మరోసారి ట్రోల్స్ బారిన పడింది అనసూయ.

ఇంతకీ ఏం జరిగిందంటే.. తాజాగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న ఫోటోని షేర్ చేస్తూ మన ఆరోగ్యమే మన మహాభాగ్యం అంటూ చెబుతూ తన నోట్ లో ఆడవారు హెల్త్ పట్ల ఉండాల్సిన జాగ్రత్తలు చెప్పుకొచ్చింది. ఈ దసరాను చెడుపై మంచి సాధించిన విజయంలా జరుపుకోండి. సోమరితనం పై హార్డ్ వర్క్, సందేశం , భయం పై ఏకాగ్రత అంకితభావం విజయాన్ని జరుపుకునేలా చేయండి. మహిళలందరినీ ఈ వీడియో ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నాను. తమపై తాము దృష్టి పెట్టండి.స్త్రీ శక్తిని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎవరు ఏం చెప్పినా? నీకు ఇప్పుడు అవసరమా ఆంటీ ? 35 దాటిన ఎందుకు ఇవన్నీ? ఇంట్లో పిల్లల్ని చూసుకోవచ్చు కదా? వగైరా వీళ్లంతా మన ఎదుగుదలపై భయపడుతూ ఉంటారు. తనలోని పరివర్తనను మేలుకొలుపుకునే ప్రతి స్త్రీ ఒక కాళీనే అంటూ నోట్ లో రాసుకొచ్చింది. ఆ పోస్ట్ పై స్పందించిన కొందరు నెగిటివ్ గా స్పందిస్తుండగా మరికొందరు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. 35 ఏళ్లు వచ్చిన తర్వాత కూడా ఈ వయసులో నీకు ఇంత పెద్ద వర్కౌట్స్ అవసరమా ఆంటీ అంటూ దారుణంగా ట్రోలింగ్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్, వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -