Waltair Veerayya: గాడ్ ఫాదర్ కంటే వాల్తేర్ వీరయ్యే బెటర్.. మాస్ ఆడియన్స్ కోసమే?

Waltair Veerayya:  సినీ ఇండస్ట్రీ నుంచి పొలిటికల్ కెరీర్‌ను స్టార్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. రాజకీయాల్లో పెద్దగా రాణించలేకపోయారు. దీంతో మళ్లీ సినీ బాట పట్టారు. ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో మళ్లీ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో చిరంజీవి మునుపటి గ్రేస్ మిస్ అయిందని చెప్పవచ్చు. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది. ఆచార్య, సైరా నర్సింహారెడ్డి సినిమాలు కూడా మాస్ ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది. ఈ సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయినా ప్రేక్షకుల్లో ఎక్కడా లేని వెలితి. తమ అభిమాన హీరో నుంచి ఊహించిన స్థాయిలో ఎక్స్ ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ మిస్ అయిందని కంప్లైంట్ వస్తూనే ఉంది.

ఇటీవల విడుదలైన ‘గాడ్ ఫాదర్’ సినిమా ప్రేక్షకులను అలరించింది. హిట్ టాక్‌తో దూసుకెళ్లింది. అయినా ఫ్యాన్స్ కు మాత్రం నిరాశ తప్పలేదు. గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి నటించిన పాత్రలో లుక్స్ వైస్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సినిమాలో ఒకే రకమైన ఎక్స్ ప్రెషన్స్ ను మెయింటెన్ చేయడానికి చిరు ఇబ్బంది పడినట్లు అర్థమవుతుంది. దీంతో ఫ్యాన్స్ లో ఇంకా నిరాశ కొనసాగింది. మరీ ముఖ్యంగా మాస్ ఆడియన్స్ లను మెప్పించలేకపోయింది.

అయితే తాజాగా విడుదలైన ‘వాల్తేర్ వీరయ్య’ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాల్తేరు వీరయ్యలో లుక్ వైజ్‌గా చిరంజీవి అదరగొట్టారు. తన బాడీ లాంగ్వేజ్, మాస్ లుక్, ఇలా అన్నింటిలోనూ చిరంజీవి డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. అప్పట్లో చిరంజీవి నటించిన ‘ముఠా మేస్త్రీ, అందరివాడు’ సినిమాల్లో పంచె కొట్టుకుని ఉన్న సీన్లు రిపీట్ అయినా.. ఈ ట్రైలర్ చూసినా మెగా ఫ్యాన్స్ కు మాత్రం పూనకాలు ఆగడం లేదు. వాల్తేర్ వీరయ్య లుక్‌గా చిరంజీవి చాలా రఫ్‌గా కనిపిస్తున్నారు. మాస్ ఆడియన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నారు. గాడ్ ఫాదర్ కంటే వాల్తేర్ వీరయ్య బెటర్‌గా అనిపిస్తోందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -