Waltair Veerayya: ఆ చిన్న ఊరిలో వాల్తేరు వీరయ్య ఏకంగా 365 రోజులు ఆడిందా?

Waltair Veerayya:గత ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి గెలిచిన సినిమా వాల్తేరు వీరయ్య. చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ వాల్తేరు వీరయ్య. ఇందులో మాస్ మహారాజా రవితేజ, శృతిహాసన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ సినిమా గత ఏడాది 236 కోట్లు రాబట్టి రికార్డు సృష్టించింది. గత ఏడాది ఇదే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా. ఒకప్పుడు కలెక్షన్ అన్నమాట ఎలా ఉన్నా సినిమా ఎన్ని రోజులు ఆడింది అనేదాన్ని ఒక రికార్డు గా తీసుకునేవారు. 100 రోజులపాటు ఆడితే అదొక గొప్ప రికార్డు.

 

కానీ ఇప్పుడు మాత్రం ఆ సినిమా ఎన్ని రోజులు ఆడింది అనేదాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు వాళ్ల పెట్టిన పెట్టుబడికి ఎంత కలెక్షన్ ఎన్ని రోజుల్లో వచ్చింది అని మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. రెండు మూడు రోజులు థియేటర్ లో ఆడినా కూడా 100 కోట్లు వస్తే ఆ సినిమా హిట్ అయినట్టు లెక్క. అయితే వాల్తేరు వీరయ్య మాత్రం ఈ ఏడాది ఒక రికార్డు సృష్టించింది. అదేంటంటే మరొక రెండు రోజుల్లో ఈ సినిమా 365 రోజులు ఒకే థియేటర్లో ఆడింది.

ఆంధ్రప్రదేశ్లోని అవనిగడ్డలో ఉన్న రామకృష్ణ థియేటర్లో రోజుకు నాలుగు ఆటలతో విడుదల రోజు నుంచి ఇప్పటివరకు విజయవంతంగా సినిమా కొనసాగుతుంది. మరొక రెండు రోజుల్లో 365 రోజులు పూర్తి చేసుకొని తెలుగు ఇండస్ట్రీలో వాల్తేరు వీరయ్య సరికొత్త రికార్డు క్రియేట్ చేయటానికి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అందరూ కలిపి 365 రోజులు వేడుక చేయడానికి సిద్ధపడుతున్నారు.

 

అందుకు సంబంధించిన పోస్టర్ ఒకటి రిలీజ్ కూడా చేశారు అది ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఇదే సినిమా 200 రోజుల వేడుకను చిత్ర యూనిట్ హైదరాబాదులో జరిపినప్పుడు చిరంజీవి మాట్లాడుతూ అత్యధిక రోజులు సినిమా ప్రదర్శితమై విజయానికి గుర్తుగా షీల్డ్ అందుకుంటున్నందుకు ఒళ్ళు పులకరిస్తుంది చరిత్రను మళ్ళీ తిరిగి రాసినట్లుగా అనిపిస్తుంది అంటూ పాత రోజులని గుర్తు చేసుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -