Balakrishna-Bobby: స్టార్ డైరెక్టర్ బాబీ డైలాగ్స్ బాలయ్యకు నచ్చలేదా.. వాళ్లపై సీరియస్ అయ్యారా?

Balakrishna-Bobby:  బాలయ్యది చిన్నపిల్లల మనస్తత్వం. ఆయన మనుషుల్ని ఎంతగా ప్రేమిస్తారో కోపం వస్తే కల్మషం లేకుండా అభిమానులపై అలాగే కోప్పడతారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేయటం, తప్పు పని చేస్తే తిట్టడం, మంచి పని చేస్తే భుజం తట్టడం ఆయనకి ముందు నుంచి అలవాటు. అందుకే చాలామంది ఆయనతో వర్క్ చేయడానికి భయపడుతూ ఉంటారు. కానీ ఆయనతో పనిచేసిన వారు మాత్రం ఆయన గురించి ఎప్పుడూ పాజిటివ్ గానే మాట్లాడడం విశేషం.

అయితే బాలయ్య మాత్రం ఆయన ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతూ ఉంటారు. అప్పుడప్పుడు తన షార్ట్ టెంపర్ ని అభిమానుల మీద చూపిస్తూ వైరల్ అవుతూ ఉంటారు బాలకృష్ణ. అలాగే ఇప్పుడు డైరెక్టర్ బాబీ మీద బాలకృష్ణ విరుచుకుపడ్డాడు అంటూ ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఏం జరిగిందంటే ఇప్పుడు భగవంత కేసరి షూటింగ్ లో ఉన్న బాలయ్య నెక్స్ట్ సినిమా డైరెక్టర్ బాబి సినిమాలో కమిట్ అయ్యాడు. ఈ సినిమా కోసం బాబీ కొన్ని డైలాగ్స్ ప్రత్యేకంగా రాసాడట.

అయితే ఎప్పుడు లేనిది కొంచెం చిలిపితనాన్ని కలబోసి మరీ డైలాగులు కొన్ని డబల్ మీనింగ్ వచ్చేలా రాసాడట బాబి. ఈ డైలాగులను బాబి టీం బాలయ్య కి వినిపిస్తే ఆయన సీరియస్ అయిపోయారట. నా సినిమాలో ఇలాంటి చెత్త డైలాగులు రాస్తావా.. బ్రెయిన్ లేదా అంటూ వాళ్ళని చడామడ తిట్టి పంపించారట బాలయ్య. అంతేకాదు ఫోన్ చేస్తే బాబీకి స్ట్రైట్ వార్నింగ్ కూడా ఇచ్చారట. స్క్రిప్ట్ చెప్పింది ఒకటి మీరు డైలాగులు రాస్తున్నది ఒకటి .

బ్రెయిన్ లేదా ఇలాంటి డైలాగ్స్ ఎవరికైనా రాస్తారా.. నా సినిమాలలో ఇలాంటివన్నీ పెడితే ఒప్పుకోను అంటూ సీరియస్ అయిపోయారట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉన్నదో లేదో తెలియదు కానీ బాలకృష్ణ కోపం లో అర్థం ఉంది అంటున్నారు ఆయన అభిమానులు. ఆయన వయసుకి తగిన డైలాగులు కాకుండా ఇలాంటి డైలాగులు ఇస్తే కోపం రాదా అంటూ వాళ్ల అభిమాన దేవుడిని వెనకేసుకొస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -