Pregnancy Precautions: గర్భధారణ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇవి చేయండి!

Pregnancy Precautions: గర్భధారణ సమయంలో స్త్రీలు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే కడుపులో ఉన్న శిశువు ఆరోగ్యం దృష్ట్యా కాబోయే తల్లులు వారి వారి ఆరోగ్యం పట్ల జన్మనిచ్చే వరకు జాగ్రత్తలు పాటిస్తూనే ఉంటారు. గర్భధారణ సమయంలో శరీరం శారీరకంగా, మానసికంగా కూడా చాలా మార్పులకు లోనవుతుంది. శరీరంలో జరిగే వివిధ రకాల హార్మోన్ల మార్పులు మూడ స్వింగ్స్‌ కు ధారితీస్తుంది.

గర్భదారణ సమయంలో మానసిక స్థితి మారడం గర్భిణుల్లో సహజంగా జరుగుతుంది. రోజంతా ఆందోళన, నిరాశ, తీవ్రమైన సమస్యకు దారితీస్తాయి. గర్భిణీ స్త్రీలు అప్పుడప్పుడు ఆందోళనకు నిరాశకు లోనవుతూ ఉంటారు. విచారం, కోపం అనేది అందరిలోనూ కలిగేదే. కొందరిలో ఇది ఎక్కువగా ఉంటుంది. గర్భిణిలలో ఈ లక్షణాలు ఉన్నట్లయితే అది డిప్రెషన్‌ కు దారి తీస్తుంది. ఒత్తిడికి గురయ్యే ల చేస్తుంది. చిన్న విషయాలకే ఆందోళన పడటం తో రక్తప్రసరణలో మార్పులు జరిగే ప్రమాదం ఉంది. కొందరిలో తల్లి కాలేమనే ఆందోళనతో పాటు ప్రసవ సమయంలో కలిగే భయం, విరక్తి ఎక్కువ ఆందోళనకు గురి చేస్తాయి. వీటితో పాటు అనేక ఆరోగ్య సమస్యలు గర్భిణిగా ఉన్నప్పుడు వచ్చే ప్రమాదం ఉంది. గర్భధారణ సమయంలో మానసిక ఆరోగ్య సమస్యల చికిత్స చాలా ముఖ్యమైనది.

గర్భధారణ సమయంలో ఒత్తిడి తెచ్చుకోరాదు. అవసరమైనప్పుడు విరామం తీసుకుంటూ ఉండాలి. కచ్చితంగా అవసరమైతే తప్ప.. ఈ సమయంలో ఉద్యోగంలో మార్పులు చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి. చురుకుగా ఉండటం వ్యాయామం చేయడం చాలా మంచిది. తరచూ పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. భోజనం, వ్యయామానికి ఓ సమయాన్ని కేటాయించుకోవాలి. అవసరమైనంత వరకు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి గర్బిణీ తల్లిదండ్రులతో సమయాన్ని గడపడం, ఆహ్లాద వాతావరణంలో ఉండటం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Asaduddin Owaisi-PM Modi: ముస్లింలే ఎక్కువ కండోమ్స్ వాడుతున్నారు.. వైరల్ అవుతున్న అసరుద్దీన్ ఒవైసీ కౌంటర్!

Asaduddin Owaisi-PM Modi:  మొదటి దశ ఎన్నికల పోలింగ్ తరువాత రాజస్థాన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ క్రమంలో ఆయన ముస్లింలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా...
- Advertisement -
- Advertisement -