Vastu Tips: ఇంట్లో తులసి చెట్టును ఏ దిక్కులో పెట్టకూడదో తెలుసా?

Vastu Tips: తులసి మొక్కను హిందువులు దేవతగా కొలుస్తారు. తులసికి ఉన్న ప్రాధాన్యం ఎనలేనిది. పురాణాల్లోనూ తులసి చెట్టును లక్ష్మీదేవతగా పూజించిన చరిత్ర ఉంది. సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువుకు తులసిని నైవేద్యంగా సమర్పిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామికి కూడా తులసి మాలతో పూజించడం ఆనవాయితీ. ఇలా చేయడం వల్ల సిరిసంపదలతో తులతూగుతారని విశ్వాసం.

 

పూజల్లోనే కాదు.. ఆయుర్వేదంలోనూ తులసికి ప్రాధాన్యం ఎక్కువే ఉంది. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంటి ఆవరణలో తులసి మొక్కను పెంచుకుంటే ప్రతికూల శక్తులు, నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా రక్షణగా ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించేలా చేస్తుంది. ఈ నేపథ్యంలో అసలు తులసి మొక్కను ఇంటికి ఏ దిక్కును పెట్టుకోవాలనే సందేహం చాలా మందికి కలుగుతుంది.

 

తులసిని రాంగ్ డైరెక్షన్ లో పెట్టుకుంటే కోరి కష్టాలు తెచ్చుకుట్లవుతుంది. వాస్తు శాస్త్రంలో తులసిని ఇంటికిక ఏ దిక్కులో పెట్టుకోవాలో తెలియజేశారు. ఎప్పుడు పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో వివరించారు. వాస్తు పండితులు చెప్పిన ప్రకారం.. తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి. దీని వల్ల శుభాలు కలుగుతాయి. తూర్పు దిశలో స్థలం లేని వారు, వీలు కాని వారు.. ఈశాన్య మూలను ఎంచుకోవచ్చు.

 

తులసి నాటేందుకు కార్తీక మాసం ఉత్తమం
పండితులు చెప్పిన ప్రకారం తులసి మొక్కను ఇంట్లో నాటుకొనేందుకు కార్తీక మాసం ఉత్తమంగా భావిస్తారు. ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తోంది కాబట్టి తులసి మొక్క లేని వారు అందరూ తమ ఇళ్లలో తూర్పు దిశలో నాటుకోవాలని సూచిస్తున్నారు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. చైత్ర మాసం శుక్ర వారం రోజు కూడా తులసిమొక్క నాటేందుకు అనువైనదిగా చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -