Cricket: రీలంక క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్లలో ఆడుతున్న బ్యాటర్ దనుష్క గుణతిలకపై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. టీ20 ప్రపంచకప్ ఆడేందుకు గాను ఆస్ట్రేలియాకు వెళ్లిన గుణతిలక.. అక్కడ ఓ యువతిని రేప్ చేసినట్టు సమాచారం. 31 ఏండ్ల ఈ ఎడం చేతి వాటం బ్యాటర్.. టీ20 ప్రపంచకప్ లో గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించినా.. జట్టును వీడకుండా అక్కడే ఉండి రసక్రీడలు ఆడాడు.
పలు జాతీయ ఛానెళ్లలో వచ్చిన కథనాల మేరకు.. లంక బ్యాటర్ గుణతిలక టీ20 ప్రపంచకప్ ఆడేందుకని ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ఈ మెగా టోర్నీలో శ్రీలంక క్వాలిఫై రౌండ్ ఆడిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ నమీబియాతో ఆడిన అతడు.. గాయపడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. గాయంతో వైదొలిగినా లంకకు రాకుండా జట్టుతోనే ఉన్నాడు. ఇదే క్రమంలో సిడ్నీకి చెందిన ఓ యువతితో ఆన్ లైన్ డేటింగ్ యాప్ లో పరిచయం పెంచుకున్నాడు.
ఆ పరిచయంతో గుణతిలక సదరు యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈనెల 2న గుణతిలక.. తనపై అత్యాచారం చేశాడని న్యూసౌత్ వేల్స్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఇంగ్లాండ్-శ్రీలంక మ్యాచ్ ముగిశాక నేరుగా టీమ్ హోటల్ కు వెళ్లిన సిడ్నీ సెంట్రల్ డిస్ట్రిక్ట్ పోలీసులు.. గుణతిలకను అరెస్ట్ చేశారు. మ్యాచ్ ముగిశాక లంక జట్టు తిరిగి స్వదేశానికి బయలుదేరగా అతడు మాత్రం అక్కడే ఉండాల్సి వచ్చింది.
BREAKING- Sri Lankan cricketer Danushka Gunathilaka has been arrested by the Sydney police on charges of rape. The team has left for home leaving him behind. @debasissen with details. @RevSportz pic.twitter.com/KUyDFMoGUB
— Boria Majumdar (@BoriaMajumdar) November 6, 2022
గుణతిలకపై ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నది. నేటి సాయంత్రం అతడిని సిడ్నీలోని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. విచారణ ముగిసిన తర్వాత నిర్దోషిగా తేలితే అతడిని వదిలిపెట్టే అవకాశముంటుంది. లేకుంటే గుణతిలక ఆసీస్ లో కటకటాలు లెక్కబెట్టాల్సిందే. గుణతిలక తన కెరీర్ లో లంక తరఫున 47 వన్డేలు 46 టీ20లు, 3 టెస్టులు ఆడాడు. టెస్టులలో 299, వన్డేలలో 1,601, టీ20లలో 741 పరుగులు సాధించాడు. ఇదిలాఉండగా రేప్ ఆరోపణలతో అతడు ఇలా పోలీసుల అదుపులోకి వెళ్లడం ఇదే ప్రథమం కాదు. 2018లో కూడా తమ దేశంలో ఓ యువతిని రేప్ చేసి అరెస్ట్ అయ్యాడు.