Pregnancy: ఇవి పాటిస్తే చలికాలంలో గర్భిణుల సేఫ్‌!

Pregnancy: చలికాలంలో వచ్చిందంటే ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటిస్తుంటారు. చిన్నారులు, వృద్ధులను మరి కాపాడుకుంటారు. శరీరానికి వెచ్చదనం ఇచ్చేందుకు దస్తువులతో పాటు తీసుకునే ఆహార విషయంలోనే అలర్ట్‌గా ఉండి తమ తమ ఆరోగ్యాలను కాపాడుకుంటుంటారు. అయితే చలికాలంలో గర్భిణులు మరింత జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. చలికాలంలో గర్భిణులు ఒకే చోట కూర్చునేందుకు ఇష్టపడుతారు. అయితే లోపలుండే బిడ్డ ఆరోగ్యానికి తల్లి వ్యాయామం తప్పకుండా చేయాల్సి వస్తోంది.

 

వ్యాయామం అంటే మరీ ఎక్కువ కాకుండా మెల్లిమెల్లిగా చేతులు, కాళ్లు శరీర ఇతర భాగాలను కదిలిస్తూ వ్యాయామం చేయాలంటున్నారు. చలికాలంలో ప్రతి ఒక్కరీ చర్మం తరచూ పొడిగా అవుతోంది. అలాంటప్పుడు గర్భిణులు తరచూ కాలిచలార్చిన నీరు తాగితే తల్లితో పాటు బిడ్డకు సురక్షితంగా ఉంటుంది. నీటితో పాటు పండ్ల రసాలు కూడా తీసుకుంటే ఇంకా మంచిది. గర్భిణులు చలికాలంలో వేడి వేడి నీటితో స్నానం చేసేందుకు ఇష్టపడుతారు. కానీ.. అలా చేయారాదు.ఎందుకంటే వేడి వేడి నీటితో స్నానం చేస్తే గర్భిణుల చర్మం పొడి బారడం ప్రారంభం అవుతోంది. అందుకే గర్భిణులు గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి.

 

చలికాలంలో వివిధ రకాల వైరస్‌లు వ్యాపిస్తుంటాయి. వాటి బారి నుంచి కాపాడుకోవాలంటే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. ఆకు కూరలు, పండ్లు, నట్స్, గింజలు, తృణధాన్యాలను ఎక్కువగా తీసుకునేలా చూసుకోవాలి. అపుడప్పుడు పాలలో కుంకుమ పువ్వు కలుపుకుని తాగితే మరింత మంచిదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. చలికాలంలో గర్భిణులు, ప్రయాణాలు, శుభకార్యాలకు దూరంగా ఉండటమే మంచిది. బయటి వాతావరణ గర్భిణులను త్వరగా అనారోగ్యాలకు గురి చేస్తోంది. ఇంట్లోనే ఉంటే అరోగ్యంతో పాటు పుట్టబోయే బిడ్డకు కూడా చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. చలికాలం వచ్చిందంటే చాలు జలుబు వెంటాడుతుంది. అది త్వరగా తగ్గకపోతే తలనొప్పితో పాటు మరిన్ని అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. వాటిని తట్టుకోని వారు వెంటనే వైద్యులను సంప్రదించి ఫ్లూ ఇంజక్షన్‌ వేయించుకోవడం మంచిది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -