Weight Loss: బరువు తగ్గాలంటే రాత్రిపూట వాటికి దూరంగా ఉండండి!

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు  ఓ సమస్యగా మారిపోయింది. ఒకప్పుడు ఓ వయస్సుకు వచ్చిన తర్వాతే బరువు పెరిగేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తీసుకుంటున్న ఆహారమే బరువు పెరగడానికి కారణమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అకస్మాతుగా పెరుగుతున్న బరువును తగ్గిచుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు.  కొందరు వివిధ రకాల శస్త్రచికిత్సలు చేయించును క్రమంలో అవి వికటించి మరిన్ని అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. మరికొందరు జీమ్, పెద్ద పెద్ద వ్యాయామాలు చేస్తూ ప్రమాదాలకు గురవుతుంటారు. అయితే కొన్ని చిట్కాలు, పాటిస్తే సులువుగా బరువును తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

రాత్రి భోజనం తర్వాత చాలా మంది అలా బయటకు వెళ్లి జ్యూస్, కూల్‌ డ్రింక్స్‌ తాగుతుంటారు. వాటిలో కలిపే చక్కెర, సోడలు బరువును అమాంగా పెంచుతాయి. ఫ్రూట్స్‌లోని పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుపడి బరువును పెంచేలా  చేస్తాయి. అందుకే రాత్రి భోజనం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో జ్యూస్, కూల్‌ డ్రింక్స్‌ తాగొద్దని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ఇంకొందరు రాత్రుల్లో ఐస్‌క్రీమ్‌లు ఎక్కువగా తింటుంటారు. ఐస్‌క్రీమ్‌లో షుగర్‌ ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయి.  ఒకవేళ ఐస్‌క్రీమ్‌ తినాలనుకుంటే 15 గ్రాములకు ఎక్కువగా షుగర్‌ లేకుండా తీసుకోవాలి.చాక్లెట్‌లో కోకో 70 శాతం కన్నా ఎక్కువ ఉన్నది మంచిది. మిగతా వాటిల్లో చక్కెర ఫ్యాట్‌ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి తినకపోవడమే మంచిది. నిద్రకు ముందు ఎలాంటి తీపి పదార్థాలు తినకూడదు. అవి అమాంతంగా బరువును పెంచేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
 ప్రాసెస్‌ చేసిన ఆహారాన్ని  అస్సలు తినకూడదు.  ఇలాంటి పదార్థాలు నిద్రపోయే ముందు తింటే  ఒబిసిటీ, బీపీ, హార్ట్‌ ఎటాక్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రాసెస్‌ చేసిన మాంసంలోని ట్రాన్స్‌ఫాట్స్‌ ఉప్పు, చక్కెరలు కేలరీలను పెంచి బరువు పెరిగేందుకు దోహదపడుతాయి. బాదం, జీడిపప్పు,పిస్తా  వంటి వాటిల్లోనూ కేలరీలు, ఫ్యాట్‌ ఎక్కువగా ఉంటాయి.  ఇవి తిన్న తర్వాత శరీరానికి శ్రమ ఇవ్వకపోతే  కొవ్వులా రూపాంతరం చెందుతాయి. రాత్రి పూట వేరు శనగలు కూడా తినకపోవడమే మంచిది.
మార్కెట్లలో లభించే చిప్స్‌లను చాలా మంది తింటుంటారు. ఇందులో  పిండి, నూనె ఉప్పు అధిక సంక్యలో  ఉంటుంది కాబట్టి వీటిని ఓ మోతాదులో తినాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -