NTR: ఎన్టీఆర్ తల్లిని నందమూరి హీరోలు అలా అవమానించారా?

NTR: సినిమా ఇండస్ట్రీ అంటే తెరిచిన పుస్తకం లాంటిది. ఎప్పుడు ఏది జరిగినా బయట పడుతూనే ఉంటుంది. అలా జూనియర్ ఎన్టీఆర్ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కూడా చాలా మందికి తెలుసు.   అయితే టాలీవుడ్ లో బడా స్టార్లలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. అయితే నందమూరి కుటుంబం నుంచి వచ్చినా కూడా తాను మొదట ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడని చాలా మందికి తెలియని విషయం. తాను పుట్టుకతోనే అదృష్టవంతుడుగా మాత్రం పుట్టలేదు.

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా వచ్చినా కూడా వారి కుటుంబం నుంచి మాత్రం మొదట్లో తనకు ఎలాంటి సపోర్ట్ లేదనే విషయం అందరికి తెలిసిందే. ఇక నందమూరి కుటుంబం నుంచి చాలా మంది కథా నాయకులు వచ్చినా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేదనే విషయం మాత్రం వాస్తవం.

 

నిజానికి జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ రెండో భార్య కుమారుడు. ఇలా రెండో భార్య కుమారుడు అవ్వడం చేతనే నందమూరి కుటుంబం దగ్గరకు కూడా రానివ్వలేదు. ఇలా తనకు మాత్రమే కాదు, జూనియర్ ఎన్టీఆర్ అమ్మ గారు షాలినికి కూడా కష్టాలు తప్పలేదు. ఇలా తల్లి కొడుకులు ఇద్దరు ఎన్నో అవమానాలకు గురి అయ్యారు.

 

ఒకానొక సమయంలో నందమూరి కుటుంబం ఎలా మాట్లాడింది అంటే కేవలం డబ్బు కోసమే షాలిని హరికృష్ణ ని ప్రేమించిందనేంత దారుణంగా మాట్లాడారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఎప్పుడు కూడా బయట పెట్టడానికి ప్రయత్నించడు. కేవలం సినిమా గురించే ప్రెస్ మీట్లలో మాట్లాడుతాడు తప్ప తాను మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందులను  మాత్రం ఎప్పటికి పంచుకోడు. ఎందుకంటే మొదట ఎలా ఉన్నా వారి కుటంబంలో కూడా మార్పు వచ్చింది. నిజం చెప్పాలంటే ఈ తరం నందమూరి నటులలో జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్నంత క్రేజ్ మరెవరికి లేదనే చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -