Yashoda: యశోద సినిమా ఎలా ఉందో తెలుసా?

Yashoda: స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం యశోద. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. నిర్మాత సమంత స్టార్ డమ్ పై నమ్మకంతో భారీగా డబ్బు వెచ్చించారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సమంత యాక్షన్, సినిమా కథ థ్రిల్లింగ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న ఈ మూవీ ఫస్ట్ రివ్యూ రానే వచ్చేసింది.

 

యశోద మూవీలో సమంత గర్బిణి పాత్రలో తనదైన శైలిలో నటించారు. వాస్తవానికి సమంత మయాసైటిస్ జబ్బుతో బాధపడుతోన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా ఇటీవల ఈ ప్రకటన చేసింది సమంత. దీంతో సెలబ్రిటీలందరూ సమంత ఆరోగ్యం కోసం ప్రార్థించారు. సమంత త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఈ నేపథ్యంలో వస్తున్న సినిమా కావడంతో యశోదపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది.

 

 

పాన్ ఇండియా స్థాయిలో యశోద మూవీ విడుదలవుతోంది. ఉన్ని ముకుందన్ హీరోగా నటించారు. వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, శత్రు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మణిశర్మ సంగీతం ప్లస్ పాయింట్ అవుతోంది. ఇటీవల సెన్సార్ పూర్తి చేసిన నేపథ్యంలో సభ్యులు సినిమా చాలా బాగుందంటూ రివ్యూ ఇచ్చారట. ప్రత్యేకమైన నేపథ్యం కలిగిన కథతో రావడం అరుదుగా జరుగుతుందని, యశోద మూవీకి ఇది బలం అవుతుందని చెప్పారట.

 

యాక్షన్ సీన్లు హైలెట్!
యశోద మూవీలో సమంత నటించిన యాక్షన్ సీన్లు మూవీలో కీ రోల్ పోషిస్తాయని తెలుస్తోంది. సినిమా ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుందని సమాచారం. మూవీ కథ ఇంట్రస్టింగ్ గా ఉందని, తెరకెక్కించిన తీరు అద్భుతమని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యశోద మూవీ పక్కాగా హిట్ కొడుతుందంటూ అభిమానులు అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుత సెన్సార్ సభ్యుల మాటను మూవీ రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు కన్ఫం చేయాల్సి ఉందట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -