CM KCR: దాడులు ఎఫెక్ట్.. ఆ ఇద్దరిని ప్రగతిభవన్‌కు పిలిచిన సీఎం కేసీఆర్

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్య ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడుతున్నారు. ప్రతి విషయంలోనూ గతంలో కంటే భిన్నంగా ముందుకెళ్తున్నారు. గతంలో ఏదైనా ఘటన జరిగినప్పుడు సీఎం కేసీఆర్ పెద్దగా స్పందించేవారు కాదు. పార్టీ నేతలతో ఏదైనా పని చేయించేవారు. కేసీఆర్ ఎక్కువ ఫామ్‌హౌస్‌లోనే సేద తీరుతూ గడిపేవారు. కానీ ఇటీవల ప్రగతిభవన్‌లోనే కేసీఆర్ గడుపుతున్నారు. ప్రతి చిన్న విషయాన్ని కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తోన్నారు. పార్టీకి, నేతలకు సంబంధించి విషయాలను ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారు.

 

ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కోసం సమమంలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు ప్రగతిభవన్ లోనే ఉంచుకున్నారు. వారి నుంచి కీలక విషయాలను తెలుసుకున్నారు. అలాగే ఇప్పుడు గత రెండు రోజులుగా టీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు కలకలం రేపుతోన్నాయి. బుధవారం మంత్రి గంగుల కమలాకర్ ఇళ్లతో పాటు ఆయన గ్రానైట్ కంపెనీలలో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు జరిపారు. ఇంటి తాళం పగలగొట్టి మరీ గంగుల కమలాకర్ ఇంట్లో తనిఖీలు చేశారు.

 

ఈ క్రమంలో గురువారం టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇళ్లు , కార్యాలయాల్లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు జరిపారు. వరుసగా రెండు రోజులుగా టీఆర్ఎస్ నేతలను ఐటీ,ఈడీ టార్గెట్ చేయడంతో గులాబీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. రానున్న రోజుల్లో ఇంకెంతమంది నేతలపై ఐటీ,ఈడీ దాడులు జరుగుతాయనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది. మంత్రి గంగులతో పాటు ఆయన సోదరులు గంగుల సుధాకర్, వెంకన్న ఇళ్లల్లో కూడా ఐటీ,ఈడీ సోదాలు జరిగాయి.

 

దీంతో సీఎం కేసీఆర్ మంత్రి గంగుల కమలాకర్, టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రను ప్రగతిభవన్ కు పిలుపించుకున్నారు. ఐటీ, ఈడీ దాడులపై వారితో చర్చించారు. టెన్షన్ పడవద్దని, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే టీఆర్ఎస్ నేతలపై చేయిస్తోందంటూ భరోసా కలప్ించే ప్రయత్నం చేశారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -