Revanth: ఆ రీజన్ వల్లే రేవంత్ ను బిగ్ బాస్ ఎలిమినేట్ చేస్తున్నారా?

Revanth: బిగ్ బాస్ గేమ్ షో.. ఎన్నో కొత్త అనుభవాలు, ఉద్వేగాలు.. అభిమానుల మధ్య యుద్దాలు.. ఇలాంటి ప్రత్యేకతలతో చాలా మంది ఫాన్స్ ని సొంతం చేసుకుంది. దీనితో ఎంతో పాపులర్ అయ్యింది ఈ రియాలిటీ షో. అయితే తమ అభిమాన నటీనటులు ఈ ఆటలో గెలవాలని ప్రతి అభిమాని కోరుకుంటారు. అంతే కాదు వారి కోసం ఓటింగ్ చేయడం.. వారిని బలపర్చటం చూస్తూ ఉంటాం. ఇక సోషల్ మీడియాలో వారి ఆపోజిట్ ఆటగాళ్ల గురించిన మీమ్స్, ట్రోల్స్ మాములుగా ఉండవు. అయితే ఏ అభినాకైనా ఎలిమినేషన్ అనగానే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఇక ఈ వారం ఎలిమినేటి అయ్యింది.. గీతూ.

 

తనదైన శైలిలో ఆడి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న బిగ్ బాస్ కాంటెస్ట్ గీతూ. తన ఎలిమినేషన్ తర్వాత భావోద్వేగ పూరిత వీడియో ఒకటి విడుదల చేసింది. ఈ వీడియోలో తన ఓటమికి గల కారణాలను, తన స్వభావాన్ని వివరించే ప్రయత్నం చేసింది. “నేను ఓడిపోయాను” అంటూ ఎమోషన్ అయ్యింది. ఇక తన తోటి కంటెస్టెంట్స్ కి చాలా సూచనలు ఇచ్చానని కానీ.. తన ఆట గురించి చూసుకోలేకపోయానని ఉద్వేగ పూరితంగా చెప్పింది.

 

గీతూ పేరెంట్స్ ఏం చెప్పారు..
ఈ సందర్భంగా గీతూ వారి అమ్మానాన్నలు చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకుంది. గీతూ ముక్కుసూటిగా ఉండేదట. ఏ విషయంలోనైనా ఎదుటి వారి మొహంపై కొట్టినట్లు మాట్లాడేదట. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా డిప్లొమాటిక్ గా ఉండడం నేర్చుకోమని గీతూ పేరెంట్స్ చాలా సార్లు చెప్పేవారట. అయినా తాను వినలేదని, ఇక ఇప్పుడు ఆ స్వభావమే తన ఓటమికి కారణం అయిందని ఈ వీడియోలో గీతూ చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉండగా గీతూకు తన ఫాన్స్ మద్దతుగా నిలుస్తున్నారు. “నీవు ఆట ఓడినా.. మనసులు గెలిచావు” అంటూ తనను ఓదారుస్తున్నారు. అసలు బిగ్ బాస్ విజేత నువ్వే అవుతావు అనుకున్నాము, కానీ ఇలా ఎలిమినేటి అవుతావని అనుకోలేదు అంటూ నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు. ఇక తాను యూట్యూబ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో లైక్స్, షేర్స్ తో వైరల్ అవుతోంది. “మనలాంటి వారిని అందరు అర్ధం చేసుకోలేరు” అని ఓ అభిమాని కామెంట్ చేసాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -