Banana: ఆ రెండు పూటలు అరటి పండు తింటే ఆ సమస్యలు వెంటాడుతాయట!

Banana: సీజన్లతో సంబంధం లేకుండా సూపర్‌ మార్కెట్‌లోనూ, వీధుల్లో చౌకగా దొరికేది ఒక్క అరటి పండు మాత్రమే. ఎన్నో పోషక విలువలతో కూడిన ఈ ఫలాన్ని పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. తక్షణ శక్తికి, తిన్న ఆహారాన్ని సులువుగా జీర్ణం చేయడంలో మెరుగ్గా పని చేస్తుంది. అందుకే దీన్ని మ్యాజికల్‌ ఫ్రూట్‌ అని కూడా అంటారు. అరటి పండులో మెగ్నీషియం, పొటాషియం, పీచు మొదలైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. అయితే అరటి పండును తీసుకునే క్రమంలో కొన్ని మెలకువలు పాటించాలంటున్నారు పోషకాహార నిపుణులు.

 

ఉదయం ఖాళీ కడుపున కసరత్తులు చేయడం వల్ల శరీరంలోని నీరు చెమట రూపంలో బయటికి వెళ్లిపోతుంది. అప్పుడు శక్తినీ కోల్పోతాం. ఈ క్రమంలో కోల్పోయిన శక్తిని తిరిగి కూడగట్టుకోవాలంటే అరటి పండు తినడం మంచిది. దీన్ని ఉదయం డైట్‌లో చేర్చుకోవడంతో ఉత్సాహంగా వ్యాయామాలు చేయవచ్చు. అదే విధంగా సాయంత్రం పూట స్నాక్స్ రూపంలో అరటి పండ్లను తీసుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో అరటి పండును తీసుకోకపోవడమే ఆరోగ్యానికి మంచిదని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

 

ఎక్కువ శాతం రాత్రి సమయంలో అరటి పండుకు దూరంగా ఉండటమే మేలట. రాత్రిపూట అరటి పండు తింటే జలుబు, గొంతునొప్పి తదితర అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. అలాగే వివిధ రకాల పండ్లు, పాలతో కలిపి అరటి పండును ఎన్నడూ తినకూడదు. ఉదయం అల్పహారం మధ్యాహ్న భోజనం తర్వాత కూడా అరటి పండును తినకపోవడమే మంచిది. ఇంకొందరు పాలతో కలిపి అరటి పండును తీసుకుంటే, మరికొందరు పాలు తాగాక అంటి పండ్లను తింటారు. ఈ రెండు విధాలు అనారోగ్యానికి మార్గాలు వేస్తాయి. ఒక వేళ ఉదయం పూట అరటి పండు తినాల్సి వస్తే మరికొన్ని పండ్లతో కలిపి తినడం ఉత్తమం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -