Munugode: రుణం తీర్చుకుంటా.. మునుగోడు ప్రజలకు కూసుకుంట్ల కీలక హామీ

Munugode: మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో కూసుకుంట్ల తన సమీప అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 10 వేలకుపైగా మెజార్టీతో ఆయన గెలుపొందారు. గెలుపొందిన తర్వాత నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తోన్నారు. తాజాగా చండూర్ మున్సిపల్ కేంద్రంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ముగింపు సమావేశంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు.

 

తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానంటూ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బీజేపీ తనను ఓడించేందుకు ఎన్నో కుట్రలు చేసిందని, కానీ నియోజకవర్గ ప్రజలు తనతోనే ఉన్నారని స్పష్టం చేశారు. తాను ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని, పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేస్తానంటూ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. రాబోయే రోజుల్లో చండూర్, చౌటుప్పల్ మున్సిపాలిటీల రూపురేఖలను మారుస్తానని చెప్పారు.

 

తన గెలుపును చూసి రాజగోపాల్ రెడ్డి గొడవలు చేస్తున్నారని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రాజగోపాల్ రెడ్డి మునుగోడులో అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తాము భయపడేవాళ్లం కాదని, అభివృద్ధిని అడ్డుకోవాలంటే చూస్తే ఊరుకోబోమని అన్నారు. మంత్రులు, వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించిన అనంతరం మునుగోడులో అభివృద్ధి పనులు మొదలవుతాయని తెలిపారు. ఢిల్లీలోనైనా లేదా గల్లీలోనైనా సరే రాజగోపాల్ రెడ్డితో తేల్చుకోవడానికి సిద్దమని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

 

కాగా మునుగోడు ఉపఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలవడంతో ఉపఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలన్నీ నెరవేర్చాలని ఇటీవల స్ధానిక నేతలకు సీఎం కేసీఆర్ సూచించారు. పనులన్నీ త్వతితగతిన పూర్తి చేయాలని తెలిపారు.దీంతో హామీలను నెరవేర్చే పనిలో నేతలు పడ్డారు.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -