Chiranjeevi: ఆ ఏరియాలో చిరంజీవి క్రేజ్ తగ్గినట్లేనా?

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం చిరంజీవి, బాలకృష్ణ రెండు కళ్లుగా ఉన్నారు. వయసు మీద పడుతున్నా యువ హీరోలతో పోటీ పడి వరుస సినిమాలు చేస్తున్నారు. ఫైట్లు, డ్యాన్సులతో అదరగొడుతున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఈ సారి సంక్రాంతికి మెగాస్టార్, బాలయ్యల సినిమాలు విడుదల కానున్నాయి. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి మూవీలతో అలరించనున్నారు.

 

ఈ రెండు సినిమాలు ఒకే బ్యానర్ నుంచి రావడం టాలీవుడ్‌లో రికార్డు. ఇప్పుడు ఈ రెండింటి హక్కులను కలిపి విక్రయిస్తున్నారని తెలుస్తోంది. పంపిణీ హక్కులను ప్రతి చోటా ఒకే డిస్ట్రిబ్యూటర్‌కు ఇస్తున్నారు. నైజాం ఏరియాకు రెండు సినిమాల హక్కులు కలిపి రూ.35 కోట్లు విలువ కట్టారు. సీడెడ్‌కు వచ్చేసరికి రూ.24 కోట్లు చెబుతున్నారు. కానీ ఇక్కడే తకరారు వస్తోంది. బాలయ్య సినిమా విడిగా ఇవ్వాలని, అలా అయితే మంచి రేటు ఇచ్చి తీసుకుంటామని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారట. దానికి మెగాస్టార్ సినిమా ముడేసి బల్క్ ప్రైస్ చెబితే సెట్ కాదని బయ్యర్లు అంటున్నారట.

 

చిరంజీవికి రెండు సినిమాల ఎఫెక్ట్
గాడ్ ఫాదర్ సినిమా సోలోగా విడుదలై, మంచి హడావుడి చేసినా, సీడెడ్‌లో రూ.8 కోట్లు రావడం కష్టం అయిందని వాపోతున్నారట. అందువల్ల అదే రేటుకు మెగాస్టార్ సినిమాను సెపరేట్‌గా ఇచ్చి, బాలయ్య సినిమాకు వేరే రేట్ కట్టి ఇవ్వమని అడుగుతున్నారట సీడెడ్ బయ్యర్లు. బాలయ్య సినిమాకు రూ.15 కోట్లు, ఇంకా పైన కూడా ఇవ్వడానికి సిద్ద పడుతున్నారట. కానీ దాంతో మెగాస్టార్ సినిమా ముడేసి ఇస్తా మంటే వెనుక ముందు ఆలోచిస్తున్నారట. మొత్తం మీద చూస్తుంటే మెగా సినిమాకు బాలయ్య సినిమాకు సీడెడ్‌లో గట్టి పోటీ వుండేలా వుంది.

 

చిరంజీవి ఇటీవల నటించిన ఆచార్య ఘోర పరాజయం కాగా, గాడ్ ఫాదర్ కూడా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. అదే సమయంలో బాలకృష్ణ నటించిన అఖండ మూవీ డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను అందించింది. ఈ లెక్కలను బేరీజు వేసుకుని రాబోయో బాలకృష్ణ సినిమాకు ఎక్కువ రేటు చెల్లించడానికి సిద్ధమవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -