Shami Plant: నవగ్రహ దోషాలు తొలగిపోవాలంటే శమి మొక్కకు ఆ రోజు పూజ చేయాలట!

Shami Plant: మన చుట్టూ కనిపించే వివిధ రకాల మొక్కలు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. కొన్ని అలంకరించేందుకు ఉపయోగపడితే మరిన్ని అనారోగ్య సమస్యలకు చెక్‌ పెడుతాయి.  మరికొన్నింటిని పూజిస్తే దోషాలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పలు శాస్త్రల్లో చెప్పబడుతోంది. మరి కొన్ని మొక్కలను ఇళ్లలో పెంచుకుంటే సుఖసంతోషాలతో ఉంటారని చాలా మంది నమ్మి వాటిని పాటిస్తారు కూడా.  శనిదేవుడికి మొక్కగా పిలిచే శమి మొక్కను పూజిస్తే జాతకంలో ఉన్న గ్రహ దోషాలు కూడా తొలగిపోయి శుభాలు కలుగుతాయని చాలా మంది నమ్ముతుంటారు.

 

శని దేవుడితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి శనివారం శమీ వృక్షం కింద ఆవాల నూనెతో దీపం పెట్టాలి. అనవసరంగా ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడుతున్నట్లయితే శనివారం ఉదయం నిద్ర లేచి తలస్నానం చేయాలి. దాని తర్వాత శమి వృక్షం మూలానికి తమలపాకులు ఒక రూపాయి పెట్టాలి. ఈ విధంగా చేయడం వలన డబ్బు కష్టాల నుంచి నుంచి బయటపడతారని నమ్ముతారు.  అంతేకాక శివుడికి సమర్పిస్తే త్వరగా అనుగ్రహిస్తాడాని చాలా మంది నమ్ముతుంటారు.  శమి మొక్కను శనివారం రోజు శని దేవుడిని పూజించడంతో పాటు శమీ చెట్టుకు నీరు పోస్తే పుణ్యఫలం వరిస్తుందని చెబుతుంటారు.

అలా చేయడంతో శని దేవుని అనుగ్రహం కలుగుతుంది. ఈ మొక్కను ఇంటి దక్షిణ దిశలో పెట్టుకోవడం ఎంతో  శుభప్రదం. ఈ దిశలో ఎక్కువగా ఈ సూర్యకాంతి లేకపోతే మీరు దానిని తూర్పు లేదా ఈశాన్య దిశలో పెట్టుకోవాలని శాస్త్రలు చెబుతుంటాయి. ఈ విధంగా ఆర్థిక స్థితి మెరుగు పడాలంటే శనివారం రోజు ఈ మొక్కను నాటాలి. అలాగే దానిని ప్రధాన తెలుపు కుడి వైపున కూడా పెట్టవచ్చు. ఈ విధంగా చేయడం వలన ధన లాభం కలుగుతుంది. శనివారం రోజు శమీ చెట్టు ని పూజించాలి..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -