Health Tips: ఉదయం లేవగానే అలసటగా అనిపిస్తే ఆ సమస్య వెంటాడుతున్నట్లే!

Health Tips: మనం రోజువారీ పనులు, ఉద్యోగాలు ఒత్తిడి వివిధ కారణాలతో సమయానికి భోజనం చేయకుండా, కంటి నిండా నిద్ర పోకుండా ఉంటాము. ఇలా భోజనం, నిద్ర లేకుండా గడిపితే వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయినా కొందరు చిన్న సమస్యలే అంటూ వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా ఎప్పటికీ చేయరాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సార్లు పురుషుల్లో వచ్చే అలవాట్లు, గుణాలను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయరాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం నుంచి ఉరుకుల పరుగుల జీవితంలో గడుపుతూ సాయంత్రం ఇంటికొచ్చి కాస్త విశ్రాంతి తీసుకుంటే ఉదయం నుంచి పడ్డ కష్టమంతా కనిపించదు. కానీ.. అలా కాకుండా ఏమాత్రం అలసటగా అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాంటున్నారు నిపుణులు.

 

 

ఇలా అలసగా అనిపిస్తే అది స్లీప్‌అప్నియా ఉంటుంది. స్లీప్‌ అప్నియా అంటే మనిషికి శ్వాస తీసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. శ్వాస మార్గంలో ఏదో అడ్డుగా ఉన్నట్లు అనిపించి ఆగిఆగి గాలి పీల్చుకోవడం జరుగుతుంటుంది. అలాంటి సమయంలో గురక వస్తోంది. ఇలా కావడంతో కంటికి సరైన నిద్ర అందక అలసట వస్తోంది. ప్లీప్‌అప్నియాను నిర్లక్ష్యం చేస్తే అధిక బరువు పెరగడం, గుండె జబ్బులను తీసుకువస్తోంది.హైబీపీతో పాటు ఇతరత్రా వ్యాధులు దరికి చేర్చి మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సాధారణంగా 3 నుంచి 5 కిలోల బరువు తగ్గడం కామనే. తక్కువ సమయంలోనే ఏకంగా 10 స్వల్ప కాలంలోనే 10 కిలోల బరువు తగ్గినట్లైతే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే కేన్సర్‌ సమస్యలు ఉన్నప్పుడు ఇలా జరగొచ్చు. ముఖ్యంగా లంగ్‌ కేన్సర్, గ్యాస్ట్రో కేన్సర్‌ లలో (పాంక్రియాస్, కొలన్, రెక్టమ్‌ కేన్సర్‌) ఇలాంటి పరిస్థితి ఏర్పడొచ్చు. ఒకవేళ మధుమేహం కారణంగానూ ఇలా జరగొచ్చు.

 

 

సాధారణంగా మన శరీరం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చుకుంటుంది. ఆహారం ద్వారా లభించే కార్బోహైడ్రేట్స్‌ ను శక్తిగా మార్చుకోలేనప్పుడు శరీరం నిల్వ చేసి ఉంచిన కొవ్వులను వాడేసుకుంటుంది. దీంతో బరువు తగ్గుతారు. ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తే అది మధుమేహానికి సంకేతం ఒకేసారి మొత్తం మూత్రాన్ని పోయలేక, వెంట వెంట కొద్ది కొద్దిగానే వస్తుంటే ప్రొస్టేట్‌ సమస్యలు ఉన్నట్టు అనుమానించొచ్చు. గ్లూటెన్‌ ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించదు. అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడవచ్చు. అప్పుడప్పుడు అయినా ప్రతి ఒక్కరూ తమ మూత్రం రంగు, మలం రంగును పరిశీలించుకుంటూ ఉండాలి. ఎందుకంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వీటి రూపంలో సంకేతాలు కనిపిస్తాయి. మూత్రం ముదురు రంగులోకి మారిపోతే బైలురూబిన్‌ మలంలో రక్తం కనిపిస్తుంటే అది కేన్సర్‌ సంకేతం అయుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP: మే ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు.. జగన్ మాయలు మామూలుగా లేవుగా!

YSRCP:  మే 1, బుధవారం ఉదయం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫోన్స్ కి వస్తున్న మెసేజ్లను చూసి ఏం జరిగిందో తెలియని అయోమయంలో పడ్డారు. అయితే అసలు విషయం...
- Advertisement -
- Advertisement -