Health Tips: ఆ పండ్లను శీతాకాలంలోనే ఎక్కువగా తీసుకోవడానికి కారణం ఇదే!

Health Tips: ప్రతి ఒక్క పండ్లు వివిధ రకాల పోషక విలువలు ఉంటాయి. అందుకే ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వైద్యులు కూడా పండ్లు, లేదా వాటి జ్యూస్‌లు తాగాలని సూచిస్తుంటారు. న్యూజిలాండ్‌లో అధికంగా లభించే కివి పండ్లును చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తాయి. ఈ పండ్లను తింటే చాలా రకాలు ప్రయోజనాలు చేకూరుస్తాయని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ఇవి తినడంతో క్యాన్సర్‌ బారిన పడే అవకాశం తక్కువ ఉంటుంది. కివి పండ్లలో ఫైబర్‌ ఫైట్‌ కెమికల్స్‌ శరీర అవయాల పనితీరును చురుగ్గా పని చేసేలా చేస్తాయి. అంతేకాక ప్రేగులు, కడుపు పెద్ద పేగు క్యాన్సర్‌ని కూడా తగ్గించేందుకు దోహదపడుతుంది.

 

నిమ్మకాయలు, నారింజలో మాత్రమే విటమిన్‌–సీ అధికంగా ఉంటుంది. కానీ కివి పండ్లలో అంతకన్నా ఎక్కువ విటిమిన్‌–సీ లభిస్తోంది. ఈ పండ్లలో 154 శాతం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇది శరీరంలో శక్తిని పెంచడంతో పాటు బరువును సులువుగా తగ్గిస్తోంది. కివి పండ్లలో ఫైబర్‌ కంటెంట్‌ అధికంగా ఉంటుంది. ఇది అధిక కొలెస్టాల్ని తగ్గిస్తుంది. శీతాకాలంలో వచ్చే ఎన్నో వ్యాధులను తగ్గిస్తుంది. రక్తపోటు సమస్య కూడా తగ్గిపోయేలా చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపడేలా చేస్తుంది ఈ పండ్లలో ఎంజైమ్స్‌ ఉంటాయి. ఇది శరీరంలోని ప్రోటీన్‌ జీర్ణక్రియలో బాగా ఉపయోగపడుతుంది. దీర్ఘాలిక మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వాళ్లకి ఇది బాగా పని చేస్తోంది. లాగా పనిచేస్తుంది

 

ఈ పండ్లలో ఉండే విటమిన్‌–కే, పొటాషియం, పొలిట్, కాపర్, విటమిన్‌ ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. చెడు కొలెస్ట్రాలను కరిగించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వీటిలో ప్రోటీన్‌ క్యాలరీలు కొవ్వు తక్కువగా ఉంటాయి. ఫైబర్‌ అధికంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వలన వెంటనే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కలుగుతుంది. ఈ పండ్లలో సెరో టోనీస్‌ పుష్కలంగా ఉండటంతో మానసిక స్థితిని మెరుగుపరచి కంటి నిండా నిద్ర వచ్చేలా సహకరిస్తోంది. మెదడులోని సెరోటీస్‌ పెంచేందుకు తోడ్పాటునందిచడంతో ప్రశాంతమైన నిద్రపోతారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -