Kantara: ఆరోజు నుంచి కాంతార ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా?

Kantara: కన్నడ ఇండస్ట్రీ నుండి ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై.. సంచలనాలకు కేరాఫ్ గా నిలిచిన సినిమా ‘కాంతార’. కన్నడ హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి తీసిన కాంతార సినిమా బాక్సాఫీస్ వద్ద తడాఖా చూపిస్తోంది. కన్నడలో  భారీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో.. దీనిని పలు భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయగా.. అన్ని భాషల్లో ఈ సినిమా అద్భుతమైన పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

 

కన్నడలో తక్కువ బడ్జెట్ తో విడుదలైన కాంతార సినిమా.. తెలుగుతో సహా పలు భాషల్లో మంచి కలెక్షన్లు సాధిస్తోంది. విడుదలై చాలారోజులే అయినా కూడా ఈ సినిమాకు ఆదరణ తగ్గడం లేదు. థియేటర్లలో సినిమాను చూసేందుకు తెలుగు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. కాగా ఓటీటీలో ఈ సినిమాను చూద్దామనుకున్న సినీ ప్రేమికులకు షాక్ మీద షాక్ తగులుతోంది.

ఓటీటీ ప్లాట్ ఫాం అయిన అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమాను ఈ నెల 18న విడుదల చేస్తామని ముందుగా అమెజాన్ ప్రైమ్ ప్రకటన విడుదల చేసింది. దీంతో థియేటర్లలో చూడలేకపోయిన జనాలు ఓటీటీలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయాలని అనుకున్నారు. కానీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ రిలీజ్ మీద నీళ్లు జల్లింది.

నవంబర్ 18న కాదు, నవంబర్ 24న కాంతారను విడుదల చేస్తామని ట్విట్టర్ ద్వారా అమెజాన్ ప్రైమ్ తెలిపింది. కానీ కాసేపటికే ఆ ట్వీట్ ని డిలీట్ చేసింది. దీంతో అసలు ఈ సినిమాను ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ అందరూ చర్చించుకుంటున్నారు. కాంతార సినిమా థియేటర్లలో ఇంకా బాగా ఆడుతున్నందుకే ఓటీటీ రిలీజ్ ను ఇలా వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.

 

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -