GodFather: గాడ్ ఫాదర్ కు ఓటీటీలో వచ్చిన రెస్పాన్స్ ఇదే!

GodFather: కరోనా తెచ్చిన కష్టకాలం ఎవరికైనా ఉపయోగపడింది అంటే అది ఓటీటీలకి మాత్రమే. దాదాపు రెండు సంవత్సరాల పాటు థియేటర్లు మూతపడడంతో ఓటీటీలే దిక్కు అయ్యాయి జనాలకి. కొన్ని సినిమాలు డైరెక్ గా ఓటీటీలో కూడా రిలీజ్ అయ్యాయి. థియేటర్లు తెరుచుకున్నాక కూడా ఓటీటీల జోరు తగ్గలేదు. కొత్తగా రిలీజయ్యే సినిమాలను వారాంతాల్లో విడుదల చేస్తున్నాయి మంచి వ్యూస్ కోసం. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఓటీటీలో సృష్టించిన సంచలనం తెలిసిందే.

ఓటీటీలో మెగా స్టార్ చిత్రానికి వచ్చిన స్పందన ఇదేనా?

చిరంజీవి తాజా చిత్రం గాడ్‌ ఫాదర్ ఓటీటీలో శుక్రవారం విదులయ్యింది. దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ గాడ్ ఫాదర్ హక్కులని సొంతం చేసుకుంది కాబట్టి అర్థరాత్రి నుంచే గాడ్ ఫాదర్ సందడి మొదలయ్యింది. వారాంతంలో విడుదలయ్యింది కాబట్టి మంచి వ్యూస్ వస్తాయని చాలా మంది అనుకున్నారు.

అయితే అందరి అంచనాలు తారుమారు అయ్యాయని అంటున్నారు నిపుణులు. ఆశించిన స్థాయిలో గాడ్ ఫాదర్ కి స్పందన రాలేదని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకనో గాడ్ ఫాదర్ అనుకున్న స్థాయిలో వ్యూస్ ని సాధించలేకపోయిందట. ప్రస్తుతం గాడ్ ఫాదర్ కి వచ్చిన రెస్పాన్స్ డిజాస్టర్ గానే చూడాలి అంటున్నారు. మెగాస్టార్ చిత్రం ఈ స్థాయిలో ఉంటుందని ఎవరూ అనుకోరు.

గాడ్ ఫాదర్ ఎన్నో అంచనాల మధ్య విడుదలయ్యింది. అయితే థియేటర్లలో అంతగా సందడి చేయలేదనే చెప్పాలి. కొన్ని చోట్ల నష్టాలు కూడా వచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఓటీటీలోకి వచ్చేసరికి గాడ్ ఫాదర్ పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. గాడ్ ఫాదర్ మూవీ మలయాళం హిట్ చిత్రం లూసిఫర్‌కు రీమేక్. మలయాళంలో ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. దసరా పండగ సందర్భంగా ఈ చిత్రం విడుదలయ్యింది. బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో ఒక మంచి గెస్ట్ రోల్ లో మెరిశారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -