Love: యువకుడి ప్రియురాలి మృతి.. ఆమె తప్ప తన జీవితంలోకి ఎవరూ వద్దంటూ!

Love: ప్రేమ అంటే రెండు మనసుల బంధం. ప్రేమను లెక్కించేందుకు ఎన్ని కష్టాలు ఎదురైనా వాటితో పోరాడి ప్రేమను పొందుతారు. కొందరు ప్రేమించుకుని మనస్పర్థలు రావడంతో విడిపోతుంటారు. ఆ తర్వాత ఒకరికొకరూ మాట్లాడకుండా ఉండారు కానీ.. ఓ యువకుడు తన ప్రేయసి కోసం పనికి అందరూ ఖంగుతున్నారు. ప్రాణంగా ప్రేమించిన యువతి చనిపోతే తట్టుకోలే చలించిపోయాడు. ఆమెతో కలిసి ఏడడుగులు వేసి జీవితం గడపాలనుకున్న అతడి కలలన్నీ ఆవిరైపోయాయి. ఆమెను తప్పా ఒంకెవరిని పెళ్లి చేసుకోకూడదని ప్రేయసి మృతదేహానికి తాళి కట్టాడు. ఇక జీవితాంతం ఒంటరిగా ఉండాలనుకుని డిసైడ్‌ అయ్యి నిర్ణయం తీసుకున్నాడు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అస్సాం మోరి గావ్‌కు చెందిన బిటుపన్‌ తమలి (27), సమీపంలోని కౌసువ గ్రామానికి చెందిన ప్రాథనా బోరా (24), ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను పెద్దలు కూడా అంగీకరించారు. కొన్ని రోజుల తర్వాత ఘనంగా పెళ్లి కూడా చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. అంతలోనే ప్రాథనా బోరా ఒక్కసారిగా ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. అనారోగ్యానికి గురైతే ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. కొంత మెరుగపడిన ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షిణించి మృతి చెందింది.

విషయం తెలుసుకున్న బిటుపన్‌ విలవిల లాడిపోయాడు. కన్నీరుమున్నీరవుతూ ప్రేయసి ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో పడుకోబెట్టిన ప్రేయసి మృతదేహాన్ని చూస్తు ఏడుస్తూ ఉండిపోయాడు. తననే పెళ్లి చేసుకోవాలనుకున్నా బిటుపన్‌ ప్రేయసి మృతదేహానికి తాళి కట్టాలనుకున్నాడు. తాను జీవితంలో మరో పెళ్లి చేసుకోనని శపథం చేసి మృతదేహానికి తాళి కట్టాడు. బిటుపన్‌ లాంటి మంచి మనస్సున్న వ్యక్తి తన సోదరి ప్రేమికుడిగా ఉండటం అదృష్టమని బిటుపన్‌ తాళి కట్టడంతో తన చెల్లెలి ఆత్మకూడా శాంతిస్తుందని ప్రాథనా సోదరి కన్నీరు కార్చింది.

Related Articles

ట్రేండింగ్

Jagan- Pawan, Sharmila: ఆ జిల్లాలో ఒకేరోజు జగన్, షర్మిల, పవన్ కళ్యాణ్.. ప్రచారంతో మెప్పించేదెవరో?

Jagan- Pawan, Sharmila: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నాయకులు జనాలలోనే ఉంటూ పార్టీ ప్రచార కార్యక్రమాలను...
- Advertisement -
- Advertisement -