Record: బాలయ్య, నానిలకు సొంతమైన అరుదైన రికార్డ్ ఇదే!

Record: తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రతి నటుడికి ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఒక్కో నటుడు ఒక్కోలా ప్రేక్షకులను అలరిస్తూ.. తన కెరీర్ లోనే బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాడు. ఈ క్రమంలో రికార్డులు కూడా క్రియేట్ అవుతుంటాయి. అలాంటి ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న స్టార్ హీరో నందమూరి బాలయ్య. నందమూరి వారసత్వాన్ని కొనసాగిస్తున్న బాలయ్య.. ఏ హీరోకు సాధ్యం కాని ఓ రికార్డును సొంతం చేసుకున్నాడు.

 

1993, సెప్టెంబ‌ర్ 3న నందమూరి బాలయ్య నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల అయ్యాయి. సోలో స్టార్ హీరోగా రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవడం అనేది వేరే ఏ హీరోకి సాధ్యం కాలేదు. బాలయ్య చేసిన నిప్పురవ్వ, బంగారు బుల్లోడు సినిమాలు 1993లో సెప్టెంబర్ 3వ తేదీ దీపావళి రోజున థియేటర్లలలో విడుదలై సందడి చేశాయి.

నిజానికి బంగారు బుల్లోడు సినిమాను ముందే ప్లాన్ చేయగా.. నిప్పురవ్వ సినిమా చాలా వాయిదాలు పడి చివరకు బంగారు బుల్లోడు సినిమా రిలీజ్ రోజు దానిని విడుదల చేయాల్సి వచ్చింది. కాగా ఈ రెండు సినిమాల్లో నిప్పురవ్వ అభిమానులను ఆకట్టుకోలేకపోగా.. బంగారు బుల్లోడు ప్రేక్షకులను అలరించి హిట్ అయింది.

తెలుగులో బాలయ్య తర్వాత ఇలాంటి అరుదైన రికార్డును సొంతం చేసుకున్న హీరోగా నాని నిలిచాడు. 2015 మార్చి 21న నాని నటించిన జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలు రిలీజ్ అయ్యాయి. జెండాపై కపిరాజు సినిమా మాస్ కాగా.. ఎవడే సుబ్రహ్మణ్యం క్లాస్ సినిమాగా వచ్చింది. అయితే ఇందులో ఎవడే సుబ్రహ్మణ్యం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలాంటి అరుదైన రికార్డును బాలయ్య, ఆయన అభిమాని అయిన నానికి మాత్రమే సాధ్యమయ్యాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -