Kohli: సెంచరీల మోత మోగిస్తున్న జగదీశన్.. విరాట్ అరుదైన రికార్డును సమం చేసిన చెన్నై బ్యాటర్..

Kohli: భారత క్రికెట్ జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లీ గతంలో సాధించిన ఓ అరుదైన రికార్డును తమిళనాడు బ్యాటర్ నారాయణ్ జగదీశన్ సమం చేశాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న ఈ యువ ఆటగాడు.. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ (వీహెచ్టీ) లో సెంచరీల మోత మోగిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్ లో పాత రికార్డుల దుమ్ము దులుపుతున్నాడు. తాజాగా జగదీశన్.. కోహ్లీ పేరిట ఉన్న ఓ రికార్డును సమం చేసి అరుదైన ఘనతను అందుకున్నాడు.

 

2008-09 సీజన్ లో విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఒకే సీజన్ లో ఏకంగా నాలుగు సెంచరీలు సాధించాడు. ఇప్పుడు జగదీశన్ కూడా ఈ ఘనత అందుకున్నాడు. వీహెచ్టీలో భాగంగా శనివారం హర్యానాతో ముగిసిన మ్యాచ్ లో జగదీశన్.. 123 బంతుల్లో 128 పరుగులు చేయడంతో ఈ ఘనత సొంతమైంది.

ఈ సీజన్ లో జగదీశన్.. ఆంధ్రప్రదేశ్ పై తొలి సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్, గోవాల మీద శతకాల మోత మోగించాడు. తాజాగా హర్యానా మీద కూడా సెంచరీ చేయడంతో కోహ్లీ రికార్డును అందుకున్నాడు. కోహ్లీతో పాటు రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్ లు కూడా గతంలో ఈ ఘనతను అందుకున్నారు. తాజాగా జగదీశన్ కూడా వీరి సరసన చేరాడు.

ఇక ఈ టోర్నీలో జగదీశన్ టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ లలో 522 పరుగులతో జగదీశన్ దుమ్ము దులుపుతున్నాడు. ఈ క్రమంలో అతడి సగటు ఏకంగా 130.50 గా ఉండటం గమనార్హం. జగదీశన్ గనక మరో సెంచరీ చేస్తే అది చరిత్రే కానుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -