Balayya: బాలయ్యపై షాకింగ్ కామెంట్స్ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి!

Balayya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ సినిమాలు చేయాలన్నా, థియేటర్లు ఊగిపోయేలా డైలాగులు చెప్పాలన్నా.. అది ఒక్క బాలయ్యకే సొంతం. నందమూరి నట వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నందమూరి బాలయ్య.. ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు నటసింహంగా మనల్ని అలరిస్తున్నాడు.

 

 

నందమూరి బాలయ్య చేస్తున్న ‘అన్ స్టాపబుల్2’ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఆయన చిన్ననాటి స్నేహితులు ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అసెంబ్లీ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిలు కనిపించడం తెలిసిందే. హైదరాబాద్ లోని నిజాం కాలేజీలో వీళ్లంతా ఒకే దగ్గర చదువుకున్నారు. కాగా తాజా ఎపిసోడ్ లో ఆనాటి జ్ఞాపకాలను అందరూ గుర్తు చేసుకున్నారు.

 

కాగా గతంలో బాలయ్య గురించి ఆయన స్నేహితుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బాలయ్య సినిమా హీరో అవుతాడనే తాము ఎప్పుడూ అనుకోలేదని కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కాలేజీ రోజుల్లో ఎంతో జాలీగా గడిపే వాళ్లమని వివరించిన కిరణ్ కుమార్ రెడ్డి.. బాలయ్య యాక్టింగ్ పట్ల ఇంత సీరియస్ గా ఉంటారని అనుకోలేదన్నారు.

 

నందమూరి బాలయ్య హీరో అనగానే నవ్వుకున్నా అని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి.. బాలయ్య ఫిజిక్ అది, చూసి నవ్వుకున్నట్లు చెప్పారు. అయితే తెలుగు ప్రేక్షుకులు ఆయనను ఆదరించారని.. ఇప్పుడు స్టార్ గా ఎదిగాడని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. సినిమాల విషయంలో నందమూరి బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ అంత సీరియస్ కాకపోవచ్చని తాము అనుకున్నామని కానీ అది తప్పని తేలిందని అన్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -