WeightLoss: బరువును సులువుగా తగ్గించుకోవాలంటే ఆ పండ్లను తినాలి!

WeightLoss: అన్ని సీజన్లలో లభించే జామ కాయ లేదా పండ్లను తినేందుకు అందరూ ఇష్టపడుతారు. దీన్ని ఇళ్లలో సైతం పెంచుకోవచ్చు. ఇందులో కొన్ని న్ని తెల్లగా, ఎర్రగా కూడా ఉంటాయి. ఒక జామపండు 10 ఆయిల్ కి సమానం అందుకే దీనికి పేదవాడి ఆపిల్ అని కూడా అంటారు.  జామ మొక్కలు మిర్టిల్‌ కుటుంబానికి చెందిన సిడియం కోవకు చెందిన మొక్కలు. శీతోష్ణస్థితి బట్టి 100 వేర్వేరు రకాలుగా లభ్యమవుతున్నాయి. ఇవి మెక్సికో, మధ్య, దక్షిణ అమెరికాలకు జాతీయ మైనవి.

 

 

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమయ్యే కొల్లాజన్ ఉత్పత్తికి ఈ పండు ఉపయోగపడుతుంది. కొవ్వు మెటబాలిజాన్ని ప్రభావితం జేసే పెక్టిన్ ఇందులో లభిస్తుంది . ఇది కొలెస్ట్రాల్ను తగ్గించి, పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడంలో సహకరిస్తుంది. జామలో కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది దోహదపడుతుంది.  జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాల వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులు సైతం ఆరగించవచ్చు.

 

ఈ పండులో నీరు 81.7 గ్రా, కొవ్వు 0.3 గ్రా, ప్రోటీన్ 0.9 గ్రా, పీచు 5.2 గ్రా,  విటమిన్-సీ 212 మి.గ్రా, ఫాస్పరస్ 28 మి.గ్రా,  సోడియం: 5.5 మి.గ్రా,  పొటాసియం: 91 మి.గ్రా, క్యాల్షియం 10 మి.గ్రా, ఐరన్ 0.27 మి.గ్రా, శక్తి: 51 కిలో కాలరీలు ఉంటుంది.  జామ పండు వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా ఉపయోగపడుతుంది, కణజాలము పొరను రక్షిస్తుంది, కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది, జామ ఏడాది పొడవునా అడపాదడపా లభిస్తున్నా శీతాకాలం లోనే వీటి రుచి బలే గమ్మత్తుగా ఉంటుంది. ప్రపంచంలో అన్ని దేశాలలోను లభిస్తుంది.. ఆసియా దేశాలలో విసృతంగా పండుతుంది. కమలా పండులో కంటే ఇదు రెట్లు అధికంగా విటమిన్‌-సీ ఉంటుంది . ఆకుకూరల్లో లభించే పీచు కంటే రెండింతలు పీచు జామకాయలో ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Tuni Assembly Constituency: తుని నియోజకవర్గంలో కూటమికి తిరుగులేదా.. యనమల కుటుంబానిదే విజయమా?

Tuni Assembly Constituency: తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో కూటమిలో కాస్త ఆ నియోజకవర్గం సీటు ఎవరిదనే విషయంపై కాస్త గందరగోళం ఉండేది. అయితే పంపకాలలో తుని నియోజకవర్గం తెదేపాకి దక్కింది. ఈ...
- Advertisement -
- Advertisement -