Health Tips: తులసి ఆకులను వాటి సహాయంతో కోయరాదు.. అలా చేస్తే అరిష్టమట!

Health Tips: ప్రతి ఒక్క హిందువుల ఇంట్లో తులసి మొక్క కచ్చితంగా ఉంటుంది. ఉదయం లేవగానే ఆ మొక్కలు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అంతేకాక ఆ మొక్కలను దేవతలతో సమానంగా భావిస్తుంటారు. తులసి మొక్క ఇంట్లో ఉంటే ఆనందం, శ్రేయస్సు, విశ్వాసానికి చిహ్నంగా భావిస్తారు. తులసి మహావిష్ణువుకు చాలా ఇష్టం అందుకే తులసి హరిప్రియ అని పిలుస్తారు. తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. తులసి మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. అనేక ఔషధ గుణాలను ఉండటంతో పాటు వివిధ రకాల వ్యాధులను నయం చేయడంలో ఈ మొక్క చాలా దోహదపడుతుంది.

 

శాస్త్రాల ప్రకారం, ఆదివారం, ఏకాదశి , గ్రహణం రోజున తులసి ఆకులను తీయకూడదు. అంతే కాకుండా ఆదివారం, ఏకాదశి రోజుల్లో తులసి మొక్కకు నీరు పోయరాదు. రెండు రోజుల్లో తులసి విష్ణువు కోసం ఉపవాస దీక్షలో ఉంటుందట అందుకే నీరు తీసుకోదు అందుకే అప్పుడు నీళ్లు పోయరాదు.
తులసి పూజ విధానం తులసి మొక్కలో విష్ణువు,లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. శాస్త్రాల ప్రకారం స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు. తులసి ఆకులను ఉదయం లేదా పగలు మాత్రమే తెంపుకోవాలి.

 

తులసి ఆకులను తెంపేటప్పుడు గోళ్ల సహాయంతో తెంపరాదని పురాణ గ్రంథాల్లో సూచించబడింది. ఒకవేళ ఎండిన ఆకులు నేలపై పడితే జాగ్రత్తగా వాటిని తీసి వేయాలని కాళ్లతో ఎప్పుడూ వాటిని తాగరాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. తులసి మొక్కను ఎటువంటి పరిస్థితిలోనూ దక్షిణ దిశలో పెంచుకోరాదు. తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలోనే భూమిలో నాటాలి. తులసి మొక్కను అవమానించిన ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవని చాలా మంది నమ్ముతారు. హిందూ మతంలో ఒక వ్యక్తి మరణించిన అనంతరం అతని నోట్లో గంగాజలంతో తులసి ఆకులను వేసి మృతదేహం నోటిలో వేస్తారు. ఇలా చేయడం వల్ల మరణించిన వ్యక్తుల ఆత్మకు శాంతి చేకూరుతుందని విష్ణుమూర్తి పాదాల చెంత స్వర్గంలో స్థానం పొందుతారని శాస్త్రంలో చెప్పబడింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -