Shreyas Iyer: చాహల్ భార్యతో శ్రేయస్ అయ్యర్ రిలేషన్.. హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం!

Shreyas Iyer: ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య సంబంధాలు తెగిపోతున్నాయి. పెళ్లైన కొద్దిరోజులకే వివాహబంధం విచ్ఛిన్నమవుతుంది. మనస్పర్ధలు, గొడవలు, విబేధాలు, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం వల్ల భార్యాభర్తలు ఎక్కువ కాలం కలిసి ఉండలేక తమ వివామబంధాన్ని తెంచేసుకుంటున్నారు. దీంతో ఇటీవల విడాకుల కేసులు ఎక్కువైపోయాయి. చిన్న చిన్న విషయాలకే విడాకులు తీసేసుకుంటున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తలు, సెలబ్రెటీలు కూడా విడాకులు తీసుకుంటున్నారు.

తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్ యుజేంద్ర చాహల్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. చాహల్, అతడి భార్య ధనశ్రీ వర్మ మధ్య గత కొంతకాలంగా విబేధాలు నడుస్తన్నట్లు ప్రచారం జరుగుతోంది. 2020 డిసెంబర్ లో వీరిద్దరి పెళ్లి జరిగింది. అయితే కొంతకాలంగా పాటు వీరిద్దరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయని, విడిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ధరశ్రీ వర్మ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి చాహల్ పేరు తొలగించడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అలాగే న్యూ లైఫ్ లోడింగ్ అంటూ ఈ నెల 17న చాహల్ ఒక పోస్ట్ పెట్టాడు. దీంతో వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు జోరందుకున్నాయి. అయితే చాహల్-ధనశ్రీల బంధం తెగిపోవడానికి టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కారణమనే ప్రచారం జరుగుతోంది.

ఇటీవల టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ ఇచ్చిన పార్టీకి తన భర్త చహల్ తో కాకుండా శ్రేయస్ అయ్యర్ తో కలిసి ధనశ్రీ హాజరైంది. ఈ ఫొటోలను సూర్యకుమార్ యాదవ్ తన సోషల్ మీడియాలో అకౌంట్ లో పోస్ట్ చేశాడు. చాహల్ ను అసలు మిస్ అవ్వడం లేదంటూ క్యాప్షన్ పెట్టాడు. దీంతో అప్పటినుంచి చాహల్, ధనశ్రీ మధ్య విబేధాలు మరింత పెరిగాయి. చాహల్-ధనశ్రీ కాపురంలో శ్రేయస్ నిప్పులు పోశాడని అంటున్నారు.

గతంలో టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ మొదటి భార్య నికితా వంజరా మరో టీమిండియా క్రికెటర్ మురళి విజయ్ తో సంబంధం పెట్టుకుంది. అతడి ద్వారా గర్భం కూడా దాల్చింది. ఇప్పుడు చాహల్ విషయంలో కూడా అలాగే జరుగుతుందని కొంతమంది అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -