Rohit Sharma: టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌పై హిట్‌మ్యాన్ ఆగ్రహం.. అవి చెత్త వ్యాఖ్యలంటూ..

Rohit Sharma: బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగు టెస్టుకు ముందు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రిపై కెప్టెన్ రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేశాడు. టీమిండియాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందన్న శాస్త్రి వ్యాఖ్యలను బయటి వ్యక్తి (అవుడ్‌సైడర్) చేసిన వ్యాఖ్యలుగానే చూస్తామని ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీమిండియా హెడ్ కోచ్ గా ఏడేండ్లు పనిచేసిన వ్యక్తికి డ్రెస్సింగ్ రూమ్ లో ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదని.. కానీ అతడు ఇలా మాట్లాడటం తగదని చెప్పాడు.

 

ఇండోర్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో భారత జట్టు దారుణంగా ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓడిన తర్వాత రవిశాస్త్రి భారత జట్టును ఉద్దేశిస్తూ.. ‘వరుసగా రెండు టెస్టులలో గెలిచిన తర్వాత టీమ్ లో కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగినట్టుంది..’అని వ్యాఖ్యానించాడు.

కాగా అహ్మదాబాద్ టెస్టుకు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో రోహిత్ కు పాత్రికేయులు శాస్త్రి కామెంట్స్ గురించి అడిగారు. అప్పుడు రోహిత్ మాట్లాడుతూ.. ‘వాస్తవంగా చెప్పాలంటే ఈ సిరీస్ లో రెండు మ్యాచ్ లు గెలిచిన తర్వాత మేం ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నామని ఓ బయటి వ్యక్తి అంటే అవి కచ్చితంగా అర్థరహిత (రబ్బిష్) మాటలే. ఎందుకంటే మేం ప్రతి మ్యాచ్ లో మా ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలనే ఆడతాం. రెండు మ్యాచ్ లు గెలిచాం కదా అని ఆగిపోం. డ్రెస్సింగ్ రూమ్ తో సంబంధం లేేని ఇలాంటి వ్యక్తులకు లోపల ఏం జరుగుతుందో తెలియదు..

 

గతంలో ఏడేండ్ల పాటు మాతో కలిసి పనిచేసిన రవిశాస్త్రికి ఇక్కడ ఏం జరుగుతుందనేది అవగాహన ఉంటుంది. మూడో టెస్టులో ఓటమి మా అతివిశ్వాసం కానేకాదు. భారత పర్యటనకు వచ్చిన ఏ జట్టుకు కూడా చిన్న అవకాశం ఇవ్వకూడదని మేం అనుకుంటాం. మేం విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి జట్లు కూడా అదే విధంగా మా మీద జాలి లేకుండానే ఉంటాయి కదా…’అని చెప్పాడు.

 

కాగా ఈ సిరీస్ లో ఢిల్లీ, నాగ్‌పూర్ లో అదరగొట్టిన టీమిండియా ఇండోర్ లో మాత్రం స్పిన్ వ్యూహంలో చిక్కుకుని విలవిల్లాడింది. ఫలితంగా సిరీస్ లో ఆస్ట్రేలియా సిరీస్ ను డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. ఇక నేటి నుంచి అహ్మదాబాద్ వేదికగా సిరీస్ లో ఆఖరిదైన నాలుగో టెస్టు అహ్మదాబాద్ వేదికగా మొదలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -