Bigg Boss: సిరి హన్మంత్ వేయించుకున్న టాటూ చూస్తే మతిపోవాల్సిందే!

Bigg Boss: ఎమోషనల్ సీన్స్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది బిగ్ బాస్. ఇక ప్రస్తుతం ఫ్యామిలీ ఎపిసోడ్స్ తో మరింత ఎమోషన్స్ పండిస్తోంది ఈ షో. ఫ్యామిలీ ఎపిసోడ్స్ లో భాగంగా ఇప్పటికే హౌజ్ లోకి.. ఆదిరెడ్డి, ఫైమా, రాజ్, శ్రీ సత్య వారి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఇక ఓ ప్రత్యేక వ్యక్తి ఇప్పుడు హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ వ్యక్తి బిగ్ బాస్ ఫామిలీ మెంబర్ కూడా.

 

రాగానే హగ్, ముద్దు..
వారు మరెవరో కాదు.. శ్రీహాన్ ప్రేయసి సిరి. సిరి బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టడంతో సీన్ మారిపోయింది. అసలు అన్ని రోజులు మాట్లాడుకోకుండా వీళ్ళు ఎలా ఉంటారు. అన్ని రోజుల తర్వాత మాట్లాడే వారి ఎమోషన్స్ ఏ విధంగా ఉంటాయి? ఎలా ఉంటారనే కలిస్తే వీళ్ళ రియాక్షన్ చూడడానికి చాల ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇక శ్రీహాన్‌ “ఫ్రీజ్‌” లో ఉండగా సిరి వచ్చి, రాగానే శ్రీహాన్‌ని హగ్‌ చేసుకుని ముద్దు పెట్టుకుంటుంది.

 

సిరి హన్మంత్ తన ప్రియుడు శ్రీహాన్ ఓ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఇది చూసి అందరు ఆశ్చర్యపోయారు. అదేంటంటే.. తన ముద్దుల ప్రియుడు శ్రీహాన్ పేరును వెనుక భాగంలో మెడ పై టాటూ వేయించుకుంది. కళ్ళు మూసుకోమని ఆ టాటూ చూపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది సిరి. అది చూసి ఆమెను హగ్‌ చేసుకుని అలా ఉండిపోయాడు శ్రీహాన్. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా హౌజ్ లోకి వచ్చాడు.

 

ఇక హౌజ్ లో ఒక్కొక్కరి గురించి వివరిస్తూ.. ఎవరు ఎలా ఉంటారని వివరించింది. అలా వారు చేసిన సంభాషణ వైరల్ గా మారింది. మొత్తానికి అభిమానులను ఎమోషనల్ గా కట్టి పడేసారు. ఒక్కొక్కరి గురించి ఒక మాట చెబుతూ వారందరినీ సర్‌ప్రైజ్‌ చేశాడు శ్రీహాన్. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రోమో నెట్టింట వివిధ సామజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Pithapuram: పిఠాపురంలో ఫుల్ సైలెంట్ అయిన ఓటర్లు.. మద్దతు ఏ పార్టీకి అంటే?

Pithapuram:  ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్థుల మీద మాటల దాడి చేస్తూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు రాజకీయ నాయకులు. ఆ పార్టీ ఈ పార్టీ అనే కాకుండా ప్రతి పార్టీ వారు తమ...
- Advertisement -
- Advertisement -