Health Tips: వామ్మో.. కాల్చిన చికెన్ తింటే అంతే సంగతి!

Health Tips: ఈ మధ్యకాలంలో చాలా మంది నాన్ వెజ్ తినడానికి బాగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే నాన్ వెజ్ లో రకరకాల రుచు లతో కూడిన స్టఫ్స్ ఉండటం వల్ల నాన్ వెజ్ తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వందలో 80 శాతం మంది నాన్ వెజ్ తింటున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా చికెన్ తో చేసిన రకరకాల ఐటమ్స్ తినాలని బాగా లొట్టలేసుకుంటారు.

 

మామూలుగా నాన్ వెజ్ శరీరానికి ఒకింత మంచిదే అయినప్పటికీ.. అది పదే పదే తినడం వల్ల కొన్ని ప్రమాదకరమైన జబ్బులు తప్పవంటున్నారు వైద్య నిపుణులు. కొంతమంది నాన్ వెజ్ ను అదే పనిగా తినడానికి ఇష్టపడుతుంటారు. కానీ అది చాలా ప్రమాదకరం.

 

బయటికి వెళ్తే చాలు చికెన్ కి సంబంధించినవి స్ట్రాటర్స్ బాగా తింటున్నారు నేటి జనాలు. అయితే అందులో తందూరి చికెన్ మాత్రం మరి ఇష్టంగా తింటున్నారు. కానీ ఇది తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తాజాగా అమెరికా మిన్నేసోటా వర్సిటీ చేసిన పరిశోధనలో బయటపడింది. చికెన్ నిప్పులపై కాల్చి తింటే ప్రమాదమని తెలిపారు.

 

ఇక కాల్చిన చికెన్ ను తినని వారితో పోలిస్తే తినేవారిలో 60% మందికి ప్యాంక్రి యాటిస్ అనే క్యాన్సర్ వస్తుందట. అంటే చికెన్ ను మంట మీద పెట్టి కాల్చడం వల్ల దాని మీద ఉన్న పై పొర లో క్యాన్సర్ కి సంబంధించిన సమ్మేళనాలు, పాలీసైక్లిక్ ఆరోమెటిక్ హైడ్రో కార్బన్ ఏర్పడతాయని పరిశోధనలో తేలింది. దీంతో అటువంటి చికెన్ తినడం తగ్గించడం మంచిదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. నిజానికి నాన్ వెజ్ ఎంత తక్కువ తింటే అంత మంచిదని సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -