Ali: ఘనంగా అలీ కూతురి మ్యారేజ్.. హాజరైన సెలబ్రిటీలు వీళ్లే!

Ali: ప్రముఖ కమెడియన్, సీనియర్ నటుడు అలీ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. అలీ కూతురు ఫాతిమా పెళ్లి పీటలెక్కింది. హైదరాబాద్ నగర శివారులోని ఓ పంక్షన్ హాల్‌లో వైభవంగా ఫాతిమా వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కింగ్ నాగార్జున, అమల, ఏపీ మినిస్టర్ రోజా, చిరంజీవి తదితరులు పెళ్లి వేడుకలో సందడి చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై, టీఎస్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితర రాజకీయ నాయకులు పెళ్లి వేడుకకు వచ్చారు. ఫాతిమా పెళ్లి షాపింగ్ నుంచి హల్దీ వేడుకల దాకా.. అలాగే పెళ్లి వేడుకలకు సంబంధించిన ప్రతీ అప్‌డేట్‌ను అలీ కుటుంబం తమ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రసారం చేస్తూ వస్తున్నారు. అలాగే పెళ్లికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అలీ అభిమానులు, నెటిజన్లు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

 

కాగా, 1979లో విడుదలైన ‘నిండు నూరేళ్లు’ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అలీ నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు, హిందీ, తమిళం భాషల్లో సినిమాలు చేశారు. దాదాపు 1100 చిత్రాలకు పైగా సినిమాల్లో అలీ నటించారు. సీనియర్ హీరోలతోపాటు యంగ్ హీరోల సినిమాల్లోనూ అలీ నటించారు. సినిమాల్లో నవ్వులు పూయిస్తున్న అలీ, ఓ టాక్ షోకి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. ప్రస్తుతం అలీ ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహాదారుడిగా నియమితులయ్యారు. వ్యక్తిగత విషయానికి వస్తే.. అలీకి జుబేదాతో వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన పెళ్లిని అలీ చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. పెద్ద కూతురు ఫాతిమా రమీజున్, రెండో కూతురు జుబేరియా, కొడుకు మహ్మద్ బాషా. పెద్ద కూతురు ఫాతిమా మెడిసిన్ చదవగా.. కాబోయే అల్లుడు డాక్టర్ కావడం విశేషం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -