Ram Charan: ఆ ప్రముఖ నటిపై రామ్ చరణ్‌కు ఇంత కోపమా?

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు రామ్ చరణ్. 2007లో డైరక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘చిరుత’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి హిట్ అవ్వడంతోపాటు.. ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ ఫేర్ అవార్డు, నంది అవార్డు కూడా దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మగధీర’ సినిమాలో నటించారు. ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. ఈ సినిమా రామ్ చరణ్‌ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది. స్టార్ హీరోగా ఎదిగాడు. రీసెంట్‌గా రామ్‌ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించారు. ఈ సినిమా ద్వారా రామ్ చరణ్‌కు పాన్ ఇండియా లెవెల్‌లో గుర్తింపు వచ్చింది. మెగా పవర్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ పొజిషన్‌లో కొనసాగుతున్నాడు. అయితే సినిమాల ఎంపిక విషయంలో రామ్ చరణ్ పూర్తిగా తండ్రి బాటలోనే నడుస్తాడు. సినిమా ఎంపిక విషయంతో ఎంతో జాగ్రత్త పడతాడు. తనకు బాగా సెట్ అయ్యే కథకే ఓకే చెప్తాడు. అలాగే సినిమాలో ఏ పాత్రకు ఏ ఆర్టిస్ట్ సెట్ అవుతారనే విషయంపై, ఎవ్వరిని ఎంపిక చేయాలనే విషయంపై రామ్ చరణ్ సలహాలు కూడా ఇస్తారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

 

 

రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’. ఈ సినిమాలో రామ్ చరణ్ నానమ్మ, తాతయ్య పాత్రల్లో జయసుధ-ప్రకాష్ రాజ్ నటించారు. అయితే షూటింగ్ సమయంలో జయసుధ అనారోగ్యానికి గురైంది. దాంతో చిత్ర బృందం షూటింగ్ ఆగకూడదని జయసుధ స్థానంలో వేరే ఆర్టిస్టును తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు చిత్ర బృందం తీసుకున్న నిర్ణయం రామ్‌చరణ్‌కు అస్సలు నచ్చలేదట. ఎందుకంటే ఆ ఆర్టిస్టు ఆమెకు వీలు దొరికినప్పుడల్లా మెగా ఫ్యామిలీపై విమర్శలతో కూడిన కామెంట్లు చేసేదట. దొరికిందే ఛాన్స్ అనుకుని రామ్ చరణ్ కూడా ఆమె సినిమాలో నటిస్తే.. నేను నటించనని డైరెక్టర్ దగ్గరికి వెళ్లి చెప్పేశాడట. దాంతో చేసేదేం లేక డైరెక్టర్లు ఆ ఆర్టిస్టును తీసుకోలేదు. జయసుధ ఆరోగ్యం కుదుటపడిన తర్వాతే సినిమా షూటింగ్ ప్రారంభించినట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: జగన్ అధికారంలోకి వస్తే ఏపీ ప్రజల భూములు పోతాయా.. బాబు చెప్పిన విషయాలివే!

Chandrababu Naidu: జగన్ మరొకసారి అధికారంలోకి వస్తే ప్రజల భూములను అధికారికంగా కబ్జా చేస్తారని భయం ప్రజల్లో పట్టుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం కబ్జాదారులకు అక్రమార్కులకు...
- Advertisement -
- Advertisement -