Nothing Phone (1): హైప్ఫో రాగానే రేటు పెంచేసిన థింగ్ సంస్థ!

Nothing Phone (1): నథింగ్ బ్రాండ్ ఇటీవల నథింగ్ ఫోన్ 1 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ట్రాన్స్ ప్రంట్ బ్యాక్ ప్యానెల్ డిజైన్ మొబైల్ ప్రీమియంను ఈ ఫోన్ అందిస్తుంది. దీంతో ఈ ఫోన్ కు సేల్స్ బాగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో నథింగ్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ ఫోన్ కు క్రేజ్ బాగా పెరగడం, భారీగా రెస్పాన్స్ రావడంతో ఫోన్ విడుదల పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నథింగ్ కంపెనీ తమ స్మార్ట్ ఫోన్ 1 ఫోన్ ధరను రూ.వెయ్యి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

దీంతో 8జీబీ ర్యామ్+128 జీబీ వేరియంట్ ధర రూ.33,999కు పెరిగింది. ఇక 8జీబీ ర్యామ్+256 జీబీ వేరియంట్ ధర రూ.36,999కి పెరిగింది. అలాగే 12జీబీ ర్యామ్+256 జీబీ వేరియంట్ ధర రూ.39,999కి పెరిగింది. ట్రాన్స్ ఫ్రంట్ బ్యాక్ ప్యానెల్, గ్లిఫ్ ఇంటర్ ఫేస్ తో కూడిన ఎల్ఈడీ స్ట్రిప్ లైట్స్ దీనికి ఉన్నాయి. 900 ఎల్ఈడీలను ఈ స్ట్రిప్స్ లో నథింగ్ పొందుపరిచింది. దీని వల్ల కాల్ వచ్చినప్పుడు, ఛార్జింగ్ పెట్టినప్పుడు, నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు బ్యాక్ ప్యానెల్ పై లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి.

దీంతో ఈ ఫీచర్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు ఏ ఫోన్ కు ఇలాంటి ఫీచర్ లేదు. ఇందులో కొత్తగా ఉండటంతో ఈ ఫోన్ ను కొనేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు.

ఈ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్స్

4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, 15 డబ్ల్యూ క్యూఐ వైర్ లెస్ ఛార్జింగ్, ఓఎల్ఈడీ బిస్ ప్లే ప్యానెల్, క్వాల్కం స్పాన్ డ్రాగన్ 778జీ ప్లస్ చిప్ సెట్, 16 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 471 ఫ్రంట్ కెమెరా

ఇంకా వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్, 6.55 అంగుళాల ఎఫ్ హెచ్డీ ప్లే+120 హెజ్ జెడ్ రిఫ్రెష్ రేట్, అండర్ డిస్ ప్లే పింగర్ ఫ్రింట్ సెన్సార్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -