Lakshmi Parvathi: జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి ఆపడానికి బాబు ప్రయత్నించారా?

Lakshmi Parvathi: టాలీవుడ్ లో యాక్టింగ్ లో అయినా డ్యాన్స్ లో అయినా ఎవరూ అందుకోలేనంత ఎత్తులో ఉన్న స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్. నందమూరి నటవారసత్వాన్ని ముందుకు తీసుకెళుతున్న మూడో తరం నటుల్లో యంగ్ టైగర్ ముందుటాడు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్ ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదగగా.. అతడికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది.

 

 

జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యన రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు కానీ గతంలో ఆయన తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడం తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించగా.. నారా చంద్రబాబు నాయుడు ఏపీకి సీఎం అయ్యాడు. అయితే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విషయంలో అడ్డుపడ్డారని సీనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి సంచలన విషయాలను బయటపెట్టారు.

నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఎదగడానికి ఎలాంటి సహకారం అందించలేదని, అడుగడుగునా అడ్డుకోవడానికి ప్రయత్నించినట్లు లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి సమయంలో కూడా నారా చంద్రబాబు నాయుడు కలగజేసుకోవడానికి చాలా ప్రయత్నించాడని, ఓ రకంగా ఎన్టీఆర్ పెళ్లిని ఆపడానికి ప్రయత్నించాడని ఆమె ఆరోపించారు.

ఎన్టీఆర్ కు పిల్లను ఎలా ఇస్తారని నార్నె శ్రీనివాస రావును ఇంటికి పిలిపించుకొని తిట్టారని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. తనకు, జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు వల్ల ప్రయోజనం చేకూరలేదని ఆమె అన్నారు. తమ ఇద్దరిని అడ్డుకోవడానికి అన్ని రకాలుగా చంద్రబాబు ప్రయత్నించాడని కానీ తాము మాత్రం జీవితంలో ఎదిగినట్లు ఆమె వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -