Record: పాక్‌ బౌలర్లపై విరుచుకుపడిన బ్రిటిష్‌ బ్యాటర్లు.. రికార్డులు బద్దలు..!

Record: టీ20 వరల్డ్‌ కప్‌ నెగ్గి జోరుమీదున్న ఇంగ్లండ్‌ జట్టు.. మరింత దూకుడుగా ఆడులోంది. తాజాగా పాకిస్తాన్‌లో పర్యటిస్తోంది ఇంగ్లండ్‌ జట్టు. టెస్టు సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌ రావల్పిండిలో కొనసాగుతోంది. ఇందులో సంచలనాలు నమోదయ్యాయి. తొలుత టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌.. బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇక టాస్‌ నెగ్గడమే తరువాయి అన్నట్లుగా ఇంగ్లండ్‌ బ్యాటర్లు విజృంభించారు.

తొలి రోజు ఏకంగా నలుగురు సెంచరీలు నమోదు చేసి పాక్‌ జట్టుకు షాక్‌ ఇచ్చారు. టీ20 తరహాలో బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ బ్యాటర్లు.. ఆద్యంతం పాక్‌ బౌలర్లకు చుక్కలు చూపించారు. అబ్బుర పరిచే షాట్లతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేశారు. టెస్ట్‌ మ్యాచ్‌ కాస్తా టీ20 మాదిరి సాగడంతో ఫ్యాన్స్‌లో జోష్‌ వచ్చింది. బ్రిటిష్‌ బ్యాటర్ల ధాటికి పాక్‌ జట్టు బలైపోయింది.

పాకిస్థాన్‌తో 3 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ గురువారం ప్రారంభమైంది. రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ తొలి రోజు 4 వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది. తొలిరోజు వెలుతురు సహకరించకపోవడంతో 75 ఓవర్లు మాత్రమే ఆడారు. ఇంగ్లిష్ జట్టు 6.74 రన్ రేట్‌తో బ్యాటింగ్‌లో ఇరగదీసింది. వచ్చీ రాగానే దూకుడు మొదలు పెట్టారు ఇంగ్లండ్‌ బ్యాటర్లు. ఇప్పటి వరకు టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిరోజు 500 పరుగులు నమోదు కాలేదు.

112 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్‌..
టెస్టు చరిత్రలో 1910లో సిడ్నీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా తొలి రోజు అత్యధికంగా 494 పరుగులు చేసింది. ఇప్పటి దాకా అదే రికార్డు. ఇప్పుడా రికార్డును ఇంగ్లండ్ జట్టు బ్రేక్ చేసింది. ఇలా 112 ఏళ్ల రికార్డును ఇంగ్లిష్ జట్టు ధ్వంసం చేసింది. ఆ మ్యాచులో తొలి రోజు ఇద్దరు ఆస్ట్రేలియా బ్యాటర్లు సెంచరీలు చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -