Prabhas: నభూతో న భవిష్యత్ అనేలా రికార్డ్ క్రియేట్ చేసిన ప్రభాస్.. ఏమైందంటే?

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి చిత్రం సలార్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. ఈ టీజర్ కూడా
అంద‌రిని ఆక‌ట్టుకుంది. జురాసిక్ పార్క్ అంటూ ప్ర‌భాస్ మీద ఇచ్చిన ఎలివేష‌న్‌తోనే ఈ సినిమా రేంజ్ ఎలా ? ఉండ‌బోతోందో చెప్ప‌క‌నే చెప్పేశారు.ఇక ఈ సినిమా విడుదలకు మరో రెండు నెలల సమయం ఉందనగా ఇప్పటికే ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

 

యుఎస్ డిస్ట్రిబ్యూటర్ ప్రత్యంగిర సినిమాస్ రిలీజ్ చేసిన అప్‌డేట్ ప్ర‌కారం ఒక్క ఉత్తర అమెరికాలోనే ఏకంగా 1980కి పైగా లొకేషన్లలో సలార్ రిలీజ్ చేస్తున్నార‌ట‌. ఇప్పటివరకు విడుదలైనటువంటి ఏ ఇండియన్ సినిమా కూడా ఈ స్థాయిలో లొకేషన్స్ కైవసం చేసుకోలేదు. దీన్ని బట్టి చూస్తుంటే ఓవర్సీస్ లో ప్రభాస్ కి ఎలాంటి క్రేజ్ ఉందో అర్థమవుతుంది.

 

ఇక ఈ సినిమా ప్రీమియర్ షో ని సెప్టెంబర్ 27వ తేదీ ఓవర్సీస్ లో ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రభాస్ సినిమాకు ఈ స్థాయిలో క్రేజ్ ఉండడం చూస్తుంటే ప్రభాస్ కి పోటీగా ఏ హీరో నిలవలేరా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సినిమాకు కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా హోం భలే ఫిలిమ్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -