Sri Satya: చమ్మక్ చంద్ర సత్యశ్రీ మధ్య అలాంటి బంధం ఉందా?

Sri Satya: ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రొగ్రామ్‌ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కామెడీ షో అత్యంత టీఆర్పీ రేటింగ్స్ దక్కించుకుంటున్న షోగా నిలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఈ షో మంచి టీఆర్పీ రేటింగ్స్‌లో కొనసాగుతూనే ఉంది. జబర్దస్త్ బాగా పాపులర్ అవ్వడంతో.. ఎక్స్ ట్రా జబర్దస్త్ ను కూడా మల్లెమాల ప్రొడక్షన్స్ ప్రవేశపెట్టింది. ఈ రెండు షోలు ప్రస్తుతం ఈటీవీకి మంచి మైలేజ్ ను, టీఆర్పీ రేటింగ్స్‌ను తెచ్చి పెడుతున్నాయి.

ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ పాపులర్ అయ్యి ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత జబర్దస్త్ నుంచి సినిమాల్లోకి కూడా అడుగుపెట్టి సిల్వర్ స్క్రీన్ పై పేరు తెచ్చుకుంటున్నారు. జబర్దస్త్ కు పోటీగా ఎన్నో షోలు ఇతర ఛానెళ్లలో వచ్చినా.. అవి అంతగా ప్రజల్లో ఆదరణ దక్కించుకుకోలేదు. జబర్దస్త్ ఇప్పటికీ తన హావాను కొనసాగిస్తోంది.

అయితే జబర్దస్త్ కమెడియన్ చమ్మక్ చంద్ర జబర్దస్త్ కు కొత్త కళను తీసుకొచ్చాడు. తొలిసారి శ్రీసత్యను తన టీమ్ లోకి తీసుకున్నాడు. ఆమెకు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. దీంతో వారిద్దరు పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత వారిద్దరు ఏవో గొడవలు కారణంగా విడిపోయారు. టీమ్ లో గొడవల వల్ల శ్రీసత్య జబర్దస్త్ మానేసింది. అయితే ఇప్పుడు శ్రీసత్య మళ్లీ జబర్దస్త్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సారి తాగుబోతు రమేశ్ టీమ్‌లో ఆమె చేరింది.

శ్రీసత్య అందుకే రీ ఎంట్రీ ఇచ్చిందా..?

తాగుబోతు రమేశ్ స్కిట్‌లలో శ్రీసత్య కనిపిస్తోంది. దీంతో చమ్మక్ చంద్ర ఆమెను వేధించాడని, అందుకే బయటకు వెళ్లిందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు చమక్ చంద్ర లేకపోవడంతో శ్రీసత్య జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త బుల్లితెర సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఆమెను బాగా గొకాడని, అందుకే అతడి టీమ్ నుంచి బయటకు వెళ్లిందని అంటున్నారు.ఇప్పుడు వేరే టీమ్‌లోకి మారడంతో నిజమేననే వార్తలొస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజమో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -