Jabardast: జబర్దస్త్ కు సౌమ్య గుడ్ బై చెప్పడం వెనుక కారణాలివేనా?

Jabardast: బుల్లితెర షో జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ద్వారా చాలా మంది సెలబ్రిటీలు అయ్యారు. యాంకర్లు కూడా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. తాజాగా ఈ షోకు పరిచయమైన కొత్త యాంకర్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

ఈ మధ్యకాలంలో జబర్దస్త్ షోలో కాంట్రవర్షీయల్ కంటెంట్ ఎక్కువ ఉంటోందని పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ లో స్కిట్స్ చేేసే కమెడియన్స్ కి సరిగ్గా రెమ్యూనరేషన్ ఇవ్వలేదని, చెక్ పేమెంట్ ఆలస్యంగా చేస్తారని, ఎవరైతే స్కిట్స్ లో బాగా చేశారో వాళ్లకే ముందు డబ్బులు ఇచ్చేస్తారని ఒక టాక్ కూడా వినిపిస్తోంది. అంతే కాకుండా చిన్నాచితకా స్కిట్స్ వేసిన వాళ్ళకి ఖాళీ చేతులే మిగులుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

 

జబర్దస్త్ లో వల్గర్ కంటెంట్ వల్ల, బాడీ షేమింగ్ కామెంట్స్ వంటివి కూడా హద్దులు మీరుతున్నాయని కొందరు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే అనసూయ కూడా ఈ షో నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొత్తగా జబర్దస్త్ లోకి యాంకర్ సౌమ్య అడుగు పెట్టగా ఆమె కూడా బాడీ షేమింగ్ కామెంట్స్ ను భరిస్తోంది. హైపర్ ఆది లాంటివాళ్ల డబుల్ మీనింగ్ డైలాగ్స్ వల్ల ఆమె చాలా ఇబ్బంది పడుతోందట.

 

అందుకే ఆమె తన అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకుని మరి జబర్దస్త్ షో నుంచి తప్పుకోబోతున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. అనసూయ చెప్పిన బాడీ షేమింగ్ కామెంట్స్ నిజమే అని జనాలు దుమ్మెత్తి పోస్తున్నారు. మరి యాంకర్ సౌమ్య దీనిపై క్లారిటీ ఇంకా ఇవ్వలేదు. ఏదేమైనా జబర్దస్త్ షో లో బాడీ షేమింగ్ కామెంట్స్ తగ్గిస్తే బావుంటుందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YCP Schemes: వైసీపీ ప‌థ‌కాల‌ను కాపీ కొట్టి పులిహోర క‌లిపేశారు.. చంద్రబాబుకు జగన్ షాక్!

YCP Schemes: ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ జోరుని పెంచేశారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలపై విమర్శలు...
- Advertisement -
- Advertisement -