Manchu Star Heros: మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య విభేదాలు.. కానీ?

Manchu Star Heros: మంచు కుటుంబంలో విబేధాలు నెలకొన్నాయని ప్రచారం జరుగుతోంది. ప్రణతిరెడ్డితో వివాహం చేసుకున్న మంచు మనోజ్‌కు వివాహం జరిగిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత మనోజ్.. భూమా మౌనికను ప్రేమిస్తున్న వార్తలు వైరల్ అయ్యాయి. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే మనోజ్ పెళ్లి విషయంపై మంచు ఇంట గొడవలు జరిగాయట. ఈ క్రమంలో మనోజ్ మంచు కుటుంబానికి దూరమైనట్లు సమాచారం. అప్పటినుంచి ఇంటికి దూరంగానే ఉంటున్నట్లు తెలుస్తోంది.

 

అయితే మనోజ్ తీసుకున్న నిర్ణయంపై మంచు ఫ్యామిలీ కూడా సీరియస్‌గానే ఉంటుంది. తండ్రి మాటను జవదాటకుండా విష్ణు కూడా తమ్ముడితో మాట్లాడటం లేదని ప్రచారం జరుగుతోంది. మంచు ఇంట విబేధాలు వచ్చినట్లు దాదాపు రెండు నెలలు కావొస్తోందట. అయితే తాజాగా మనస్పర్థలు చెరిగిపోయినట్లు తెలుస్తోంది. మనోజ్ మళ్లీ కుటుంబంతో బంధం కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అభిమానులు చెబుతున్నారు. ఇటీవల మంచు విష్ణు పుట్టిన రోజును జరుపుకున్నారు. అప్పుడు మనోజ్.. జంబలకిడి జారు మిఠాయి సాంగ్ పాడించి విష్ణుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. కానీ విష్ణు మాత్రం తిరిగి థ్యాంక్స్ కూడా చెప్పలేదని తెలుస్తోంది.

 

తనకు విషెస్ చెప్పిన ప్రతిఒక్కరికీ రిప్లై ఇచ్చిన విష్ణు.. మనోజ్‌కు మాత్రం రిప్లై ఇవ్వలేదని నెట్టింట చర్చ జరుగుతోంది. అలాగే తాజాగా మంచు విష్ణు కుమార్తెలైన అరియానా, వివియానా పుట్టినరోజు వేడుకలు జరిగాయి. బాబాయ్ మనోజ్ కూడా ఇద్దరికీ బర్త్ డే విషెస్ చెప్పాడు. అయితే దీనిపై కూడా మంచు ఫ్యామిలీ రెస్పాండ్ కాలేదంట. మనోజ్ దగ్గరవ్వడానికి ఎంత ట్రై చేసినా.. మంచు ఫ్యామిలీ దూరం పెట్టడానికి ట్రై చేస్తున్నట్లు నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. అయితే మరికొంత మంది మాత్రం.. సోషల్ మీడియాలో అన్నదమ్ములు మాట్లాడుకోవాలని రూల్ లేదని, కలిసినప్పుడు మాట్లాడుకుంటారేమోనని చెప్పుకొస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -