Manoj: అన్ని ఇబ్బందులను అధిగమించి మనోజ్ పెళ్లి చేసుకున్నారా?

Manoj: ఇటీవలే మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి ఇద్దరు రెండవ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరికీ కూడా ఇది రెండవ వివాహం కావడం విశేషం. అయితే ఎప్పటినుంచో ఈ జంటకు సంబంధించి వార్తలు జోరుగా వినిపిస్తున్నప్పటికీ స్పందించని మనోజ్ మౌనిక ఎట్టకేలకు మూడుముళ్ల బంధంతో ఆ వార్తలకు చెక్ పెట్టేశారు. అయితే చాలా కాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నప్పటికీ మోహన్ బాబు అంగీకారం దొరకని కారణంగా ఎన్ని రోజుల పాటు పెళ్లి చేసుకోకుండా తండ్రి అనుమతి కోసం వెయిట్ చేశారని, మోహన్ బాబు పెళ్లికి నిరాకరించాడు అంటూ ఇలా అనేక రకాల వార్తలు వినిపించాయి.

మనోజ్ రెండో పెళ్లి మంచు విష్ణు మంచు మోహన్ బాబుకు ఏమాత్రం ఇష్టం లేదని వీరి పెళ్లికి కూడా హాజరవుతారా లేదా అని కూడా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ పెళ్లికి అన్నీ తానై ప్రతి ఒక్కటి తన ఇంట్లోనే గ్రాండ్ గా జరిపించి పెళ్లి పెద్దగా నిలిచింది మంచు లక్ష్మి. అయితే పెళ్ళిలో మోహన్ బాబు కనిపించారు. మౌనికని దగ్గరకి తీశారు. మంచు మనోజ్ పెళ్ళి వ్యవహారంలో అన్ని తానై నడిపించిన మంచు లక్ష్మి తాజాగా తమ్ముడి రెండో పెళ్ళి సీక్రెట్స్ రివీల్ చేసింది. మనోజ్ పెళ్లి వేడుక జరిగిన విషయాలన్నీ కూడా తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది మంచు లక్ష్మి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

 

నాన్న మనోజ్, భూమిక పెళ్లిని ఒప్పుకోవాలని యాదగిరి గుట్టకి వెళ్లి లక్ష్మి నరసింహ స్వామిని వేడుకున్నాను. మనోజ్ పెళ్ళి నాన్న అంగీకారంతో నువ్వే చెయ్యాలని ఆ దేవుడికి మొరపెట్టుకుందట. మనోజ్-మౌనికలు పెళ్ళికి ముందు నా దగ్గరే ఉండేవారు. పెళ్లి తర్వాత విడిగా ఇల్లు తీసుకున్నారు. అయితే రెండు విభిన్న కుటుంబాల కలయికని నాన్న ఒప్పుకోవడంతో వారి పెళ్ళి జరిగిపోయింది. ఆ తర్వాత మనోజ్ మౌనిక లను కూడా యాదగిరి గుట్ట తీసుకువెళ్లాను అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం కానీ ఆ దేవుడు నాకు ఒక బిడ్డను మాత్రమే ఇచ్చాడు అని తెలిపింది మంచులక్ష్మి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -