Ball Tampering: ఇంగ్లండ్ స్టార్ ఆటగాడిపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు.. నిజమేనా?

Ball Tampering: ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్ పర్యటనలో ఉంది. ఈ సందర్భంగా పాకిస్థాన్‌తో ఇంగ్లండ్ జట్టు మూడు టెస్టుల సిరీస్ ఆడుతోంది. తొలి టెస్టు ఇప్పటికే వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ మ్యాచ్ కోసం వేసిన పిచ్ దారుణంగా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. పరుగులు సులభంగా వస్తుండటంతో బ్యాట్స్‌మెన్ పండగ చేసుకుంటున్నారు. ఇంగ్లండ్ జట్టులో ఏకంగా నలుగురు ఆటగాళ్లు సెంచరీలు చేశారు. పాకిస్థాన్ ఆటగాళ్లు కూడా సెంచరీలతో కదం తొక్కుతున్నారు. ఇప్పటికే ముగ్గురు సెంచరీలు పూర్తి చేశారు.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వైఖరి కారణంగా టెస్టు క్రికెట్ చచ్చిపోతుందని క్రీడాభిమానులు మండిపడుతున్నారు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ మరో వివాదానికి కారణంగా మారుతోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

క్రికెట్‌లో బంతిని ఒక వైపు షైన్ చేయడం క్రికెటర్లకు అలవాటు. బంతి తమ చేతికి వచ్చిన ప్రతిసారీ ఉమ్మితో ఒక వైపు షైన్ చేసేవారు. అయితే కరోనా తర్వాత ఉమ్మి వాడకంపై ఐసీసీ నిషేధం విధించింది. దీంతో చాలా మంది ఆటగాళ్లు చెమటతో బంతిని తుడుస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ 72వ ఓవర్ ముగిసిన తర్వాత ఓలీ రాబిన్సన్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఈ క్రమంలో రూట్ తన చెమటతో బంతిని తుడవలేదు. అటుగా వచ్చిన జాక్ లీచ్ తలపై ఉన్న టోపీ తీసి అతని బుర్రకేసి బంతిని రుద్దుతూ షైన్ చేయడానికి ప్రయత్నించాడు.

నవ్వుకున్న కామెంటేటర్లు
అయితే రూట్ చేసిన పని చూసి కామెంట్రీ బాక్స్‌లో కామెంటేటర్లు తెగ నవ్వేశారు. ఇదో అత్యంత తెలివైన పని అంటూ సెటైర్లు వేశారు. జాక్ లీచ్ తలపై ఉన్న చెమటతో బంతిని షైన్ చేయడం చాలా సిల్లీగా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో రూట్ బాల్ ట్యాంపరింగ్ చేశాడంటూ కొందరు జోకులు వేస్తూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఈ టెస్టు నాలుగో రోజు కొనసాగుతోంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 657 పరుగులకు ఆలౌటైంది. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ ఇంకా ముగియలేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -