FIFA World Cup 2022: షాక్.. కామెరూన్ చేతిలో బ్రెజిల్ ఓటమి. చొక్కా విప్పి అలా..

FIFA World Cup 2022: ఉత్కంఠ రేపుతున్న FIFA World Cup 2022 గ్రూప్ దశలో మరో సంచలనానికి వేదిక అయ్యింది. ఇప్పటికే 5 సార్లు టైటిల్ గెలిచిన అత్యంత బలమైన జట్టు బ్రెజిల్ కు కామెరూన్ ఝలక్ ఇచ్చింది. గ్రూప్-జి లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ఈ సంచలనం జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో విన్సెంట్‌ అబూబాకర్‌ (90 + 2) లేటు గోల్‌ తో కామెరూన్ 1-0 తేడాతో బ్రెజిల్ ను ఓడించింది.

ఇప్పటికే నాకౌట్ కు చేరిన బ్రెజిల్..
మొదటి రెండు మ్యాచుల్లో గెలిచి ఇప్పటికే నాకౌట్ బెర్తు కన్ఫర్మ్ చేసుకున్న బ్రెజిల్.. ఈ మ్యాచ్ లో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లతో బరిలోకి దిగింది. ఇక మొదటి హాఫ్ టైములో పదేపదే దాడులు చేసిన బ్రెజిల్.. సృష్టించుకున్న అవకాశాలను గోల్స్ గా మలచడంలో విఫలం అయింది.

దాదాపుగా మ్యాచ్‌ పేలవమైన గోల్‌లెస్‌ డ్రాకు దారితీస్తుందని అని అందరు ఫిక్స్ అయిపోయిన తరుణంలో.. స్టాపేజ్‌ సమయంలో సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడైన జిరోమ్‌ ఎన్‌గామ్‌ కొట్టిన క్రాస్‌ను అబూబాకర్‌ హెడర్‌తో గోల్‌లోకి పంపి సక్సెస్ అయ్యాడు. దీనితో కామెరూన్‌ 1 – 0 తో విజయ తీరాలను ముద్దాడింది. ఈ గోల్ తో 2002 తర్వాత బ్రెజిల్ కు ఇదే మొదటి విజయం కావడం విశేషం.

ఇదిలా ఉండగా.. అబూబాకర్‌ గోల్‌ కొట్టిన తర్వాత జెర్సీని తీసేసి సంబరాలు ప్రారంభించాడు. ఇది నిబంధనలకు విరుద్ధం అవడంతో రెఫరీ ఎల్లోకార్డు చూపించాడు. అయితే అంతకుముందే ఎల్లో కార్డు పొందడంతో అబూబాకర్‌ రెడ్‌కార్డుగా మైదానం వీడాల్సివచ్చింది. మొత్తానికి బలమైన బ్రెజిల్ ను కామెరూన్ ఓడించడం గొప్ప విషయమే.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -